వివాహేతర సంబంధం వలనే హత్యాయత్నం -గోవిందమ్మ కుమార్తె ప్రసన్న అడ్డుగా ఉందనే హత్యకు కుట్ర -తలపై రాడ్డుతో బాది చనిపోయిందని పారిపోయిన సాయిరాం- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

దర్శి పట్టణంలో శుక్రవారం ఉదయం తల్లీకూతుళ్లపై జరి గిన హత్యాయత్నానికి వివాహేతర సంబంధమే కారణమని స్థానిక ఎస్సై రామకృష్ణ తెలిపారు. దర్శి పోలీస్ స్టేషన్లో శని వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివ రాలు వెల్లడించారు. దర్శికి చెందిన పెద్దిశెట్టి సాయిరాం అలి యాస్ వెంకటప్రభు శేషసాయి స్థానికంగా నివాసం ఉంటున్న గోవిందమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల నుంచి గోవిందమ్మతో పాటు ఆమె కుమార్తె ప్రసన్నను తిడుతూ
కొడుతూ ఉన్నాడు. ఇంటికి రావద్దని వారు చెప్పినా వినకుండా వేధిస్తున్నాడు. తన తల్లిని బాధపెట్టడాన్ని భరించలేక పోయిన ప్రసన్న.. ఇంకోసారి ఇంటికి వచ్చి తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెడతామని హెచ్చరించింది. గోవిందమ్మతో తన వివాహేతర సంబంధానికి ప్రసన్నను అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నిన సాయిరాం.. శుక్రవారం ఉదయం ఇంటి బయట మంచంపై పడుకుని ఉన్న ప్రసన్న తలపై రాడ్డుతో విచక్షణా రహితంగా 8 సార్లు బాది చనిపోయిందని భావించి వెళ్లి పోయాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *