వ్యవసాయరంగాన్ని రక్షించుకోవాలన్నా, రైతాంగ సమస్యలు పరిష్కరించుకోవాలన్నా, ఐక్యఉద్యమాల స్పూర్తితో పోరాటాలకు సన్నదం కావాలని ఏపీ రైతు సంఘం జిల్లా సహయకార్యదర్శి పంటా ఏడుకొండలు తెలిపారు. వ్యవసా యరంగ సంక్షోభం- పరిష్కార మార్గాలు అనే అంశంపై ఈ నెల 7వతేదీ ఒంగోలు నందు జరుగనున్న సెమినారు రైతాంగం తరలి రావాలని కోరుతూ ఆదివారం తాళ్లూరు నందు కరపత్రాలు పంపిణీ చేశారు. జిల్లాలో రైతాంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ సెమినార్ కు అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ విజుకృష్ణన్, ప్రొఫెసర్ కె. నాగేశ్వరరావు, ఏపీ రైతు సంఘం అధ్యక్షులు వి.కృష్ణయ్య, ఏపీ కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి యమ్.హరిబాబులు ముఖ్యఅతిథిలుగా హజరవుతున్నం దున రైతాంగంఅధికసంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.
వ్యవసాయరంగాన్నిరక్షించుకోవడానికి రైతాంగం ఐక్య పోరాటాలకు సన్నద్దంకావాలి
02
Jul