దర్శి మండలంలో గురు పౌర్ణమి సందర్భంగా పలు సాయిబాబ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్థానిక శివనాగసాయి దత్తాశ్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, వైఎస్ఆర్సిపి తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఎమ్మె ల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. దుశ్శాలువాలు, పూలమాలలతో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ వైఎస్ఆర్సిపి తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్రలను సత్కరించారు.



