శివరామపురంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేయూత -గురు పూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన విద్యార్థులు

శివరామపురం ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు దర్శి పట్టణానికి చెందిన వాసవి గోల్డ్ షాప్ అధినేత దేవతి రవికుమార్ తండ్రి దేవతి చెంచయ్య ల జ్ఞాపకార్థం విద్యార్థుల అభ్యసనానికి అవసరమైన రూ.5 వేల విలువైన నోటుపుస్తకాలు, పెన్నులు, పలకలు, బలపాలుఅభ్యసన సామగ్రి అందించారు.  మండల విద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య, విద్యాశాఖాధికారి -2  ఎల్. సుధాకర్ల చేతుల మీదుగా విద్యార్థులకు అభ్యసనా సామాగ్రిని అందించారు.
*గురువులను సన్మానం…….*
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి. శ్రీనివాస్ అధ్వర్యంలో గురు పూజోత్సవం నిర్వహించారు. ఎంఈఓ-2 సుధాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు ఎంఈఓ-2 సుధాకర్ రావును, ప్రధానోపాధ్యాయులు టి. శ్రీనివాస్ ను. ఉపాధ్యాయులు సీహెచ్ నాగి రెడ్డిని ఘనంగా సన్మానించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *