ప్రజా సంక్షేమమే ప్రభుత్వ అభిమతమని సర్పంచ్ మా ఇంద్రసేనారెడ్డి అన్నారు. మండలంలోని విఠలాపురం, పంచాయితీలో బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. సర్పంచి మారం ఇంద్రసేనా రెడ్డి పాల్గొని జగనన్న సురక్ష పథకం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా నేరుగా ఎటువంటి ఆలస్యం లేకుండా 11 రకాల సర్టిఫికేట్సును ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుందని అన్నారు. గ్రామాల్లో వారి ముంగిట్లోకే పాలనను తీసుకొచ్చిందని తెలిపారు. ఇప్పటికే 99శాతం మేర లబ్ది చేకూరిందని అన్నారు. ఎంపీడీఓ కార్యాలయ పర్యవేక్షకులు శ్రీనివాసరావు. వ్యవసాయాధికారి ప్రసాదరావు, వీఆర్వో సుజాత తదితరులు పాల్గొన్నారు.
