బికెవి ఎక్స్ప్రెస్ గ్రీన్చానల్ హైవే రోడ్డు నిర్మాణానికి తాళ్లూరు మండలంలో సేకరించిన భూములను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు బుధవారం పరి శీలించారు. తాళ్లూరు మండలంలోమల్కాపురం నుండి బొద్దికూరపాడు వరకు బికెవి ఎక్స్ప్రెస్ రోడ్డు నిర్మాణానికి రైతుల వద్ద నుండి భూములను సేకరించారు. రైతులతాలూకు రావాల్సిన నగదును రైతుల అకౌంట్లకు జమచేశారు. దీంతోఆభూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు జెసీభూములను పరిశీలించారు. తాళ్లూరు, సోమవర్పాడు గ్రామాల వద్ద బికె విఎక్స్ ప్రెస్ రోడ్ కు రైతుల వద్ద నుండి సేకరించిన భూము లను జెసీ పరిశీలించారు. ఆయనవెంట ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావు, తహసీల్దార్ కెవిప్రసాద్, సర్వేయర్ బాబూరావు, విఆర్వోలు నాగలక్ష్మి, రాఘవరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
