విఠలాపురం గ్రామానికి చెందిన నవులూరి విద్యాసాగర్ ఎంపీపీఎస్ స్కూల్ ప్రహరీగోడ నిర్మాణం ఎమ్ఎన్ఆర్ జీఎస్ కింద చేపట్టిన బిల్లులు చెల్లింపులో రెండవ బిల్లు చెల్లింపులో విచారణ జరిపి సమగ్రనివేదిక అందజేయాలని విస్తరణాధికారిని ఆదేశిస్తూ జిల్లా పంచాయతీ అధికారి జివీనారాయణ ఆదేశాలు జారీచేశారు. తాను చేసిన పనుల తాలూకు పంచాయతీ అకౌంట్ కు బిల్లులు జమైనా తనకు చెల్లించలేదని ఆగ్రామానికి చెందిన నవులూరి విద్యాసాగర్ జిల్లాకలెక్టర్, స్థానికఎంపీడీవోలకు తగు వివరాలతో ఫిర్యాదు చేశాడు. గత ప్రభుత్వ కాలంలో ఎమ్ఎన్ఆర్అజిఎస్ కింద రూ. 8 లక్షల 75 వేల రూపాయల అంచనాలతో ఎంపీపీ స్కూల్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడను నిర్మించారు. ఆబిల్లు తాలుకూ బిల్లు మొదటి విడతగా రూ32,310లు గ్రామ కార్యదర్శి చెల్లించి యున్నారు. మిగిలిన 3,86,316లు పంచాయతీకి అకౌంటుకు జమైనా తనకు విఠలాపురం పంచాయతీ అధికారులు చెల్లించ క పోవటంతో అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆబిల్లుల చెల్లింపు తాలూకు పంచాయతీ రికార్డులను పరిశీలించి విచారణ జరిపి సమగ్ర నివేదిక 3రోజుల్లో కార్యాలయంలో అందజేయాలని ఈఓఆర్డీని
ఆదేశించారు.
విఠలాపురం పంచాయతీకి జమైన ప్రహరీగోడ నిర్మాణబిల్లుల చెల్లింపుపై విచారణకు డీపీవో ఆదేశం
05
Jul