మంచి ఆరోగ్యానికి నిలయం- చిరుధాన్యం -వ్యవసాయ అధికారి ప్రసాదావు

మంచి ఆరోగ్యానికి నిలయం చిరుధాన్యాలని మండల వ్యవసాయ అధికారి ప్రసాదావు అన్నారు. తాళ్లూరు మండలంలోని శివరామపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గురువారం చిరుధాన్యాల ఉపయోగంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ… చిరుధాన్యాలు, రోగ నిరోధక శక్తికి స్థావరాలని వీటిని ఉపయోగించినట్లయితే శరీర రోగ నిరోధక శక్తి పెరిగి మంచి ఆరోగ్య వంతులు అవుతారని తెలిపారు. చిరుధాన్యాలు నేడు సిరి ధాన్యాలుగా మారి మంచి ఆరోగ్య ప్రసాదునిగా రైతులకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే పంటలుగా ఉపయోగపడుతున్నాయని ఆయన తెలిపారు. న
పాఠశా లలలో రాగి జావా ఇస్తున్నారని ఇది ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుందని ఆయన తెలిపారు. రాగులు, సజ్జలు, కొర్రలు, ఆండ్రు కొర్రలు, అరికలు తదితర చిరుధాన్యాలను ఆహారంగా ఉపయోగించినట్లయితే మంచి ఆరోగ్యం చేకూరుతుందని ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు భూమా శ్రీనివాసరావు అన్నారు. గ్రామ వ్యవ సాయ సహాయకులు రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు, 240 మందికి పైగా విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *