తాళ్లూరు మండలం మాధవరం గ్రామంలో ఆర్ అండ్ బి రోడ్డు కి సైడ్ కాలల నిర్మాణం పనులను మొదలుపెట్టారు. గ్రామంలో దీర్ఘ కాలికంగా ఉన్నటువంటి సమస్యకు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సహకారంతో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు స్థానిక వైసీపీ నాయకుల కృషితో సైడ్ కాలు మంజూరు చేయించి పనులను మొదలుపెట్టడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు . నిత్యం సైడ్ కాలవలు లేక రోడ్లపై మురుగు రోడ్లపైకి చేరుతూ ..రోడ్లు దెబ్బ తినడంతో పాటు ప్రజలు కూడా రోగాల బారిన పడుతున్నారు. ఇది గమనించిన స్థానిక ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ఎమ్మెల్యేకి దీర్ఘకాలిక సమస్యపై వివరించారు. దీంతో తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరుకు కృషి చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి కృషి తో సైడ్ కాలనీ నిర్మాణం చేయడం హర్షినీయమని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాలరావుకి, తాళ్లూరు మండల వైసీపీ ఇన్చార్జ్ మద్దిశెట్టి రవీంద్ర కి జడ్పిటిసి మారం వెంకట రెడ్డికి ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.
మాధవరంలో ఆర్ అండ్ బి రోడ్డు సైడ్ కాలవని నిర్మాణానికి శ్రీకారం – దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టికి ఎంపీపీ తాటికొండ కు స్థానిక వైసీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రజలు
08
Jul