తెలుగు వారి గుండెళ్లో కొలువైన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అని వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర అన్నారు. నియోజక వర్గంలో శనివారం రైతు బాధవుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్శి పట్టణంలో గడియారం స్తంభం సెంటర్, రెడ్డికాంప్లెక్స్ల వద్ద నిర్వహించిన వేడుకలలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు మద్దిశెట్టి రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులుఅర్పించారు. .ఆయా కార్యక్రమాలలోఎంపీపీ సుధా అచ్చయ్య, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, కౌన్సిలర్లు విసి రెడ్డి, మోహన్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, వైఎస్ ఎంపీపీ లు సోముదుర్గా రెడ్డి, కొరివి ముసలయ్య ,తాళ్లూరు జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, సొసైటీ చైర్మన్ వేమిరెడ్డి చెన్నారెడ్డి, మిల్లర్ బుజ్జి, యర్రయ్య, ఎదురు శ్రీనివాస రెడ్డి, కొడవటి జాన్, జయ సింహ, గంజి వెంకటేశ్వర్ రెడ్డి రమణారెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





