పేద కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి గొప్ప రాజకీయ వేత్తగా ఎదిగి, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని ఎందరో పేదలకు న్యాయం చేసిన ప్రకాశంపంతులు ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ ముం దుకు సాగాలని పలువురు వక్తలు తెలిపారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టం గుటూరి ప్రకాశం పంతులు 151 జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్రోద్యమంలోముందుండి, బ్రిటీష్ వారికి ఎదురొడ్డి నిలిచిన ధైర్యశాలి ఆంధ్రనకేశరి టంగుటూరి ప్రకాశంపంతులును…. ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. వెల్లంపల్లి రోడ్డులోగల ప్రకాశంపంతులువిగ్రహానికి పూల మాలలు వేసి నివాలులు అర్పించారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద కార్యాలయ సూపరిండెంట్ వజ్జా శ్రీనివాసరావు ప్రకాశం చిత్రపటానికి పూల మాలలువేసి నివాళులర్పించారు . ప్రకాశం పంతులు విగ్రహాంతో పాటు జాతీయ నేతలు అబ్దుల్ కలాం, మథర్ థెరిస్సా ,పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాలులు అర్పించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజెన్లు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు చిలకలసుబ్బారెడ్డి, బిజ్జం వెంక టేశ్వరరెడ్డి, బి.వి.కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఐ.వేణుగోపాల్ రెడ్డి, కోట హనుమారెడ్డి, ఐ.బలరామిరెడ్డి, కోట రమణారెడ్డి సంఘసంస్కర్తలు, తదితరులు పాల్గొన్నారు.
