రైతు భరోసా కేంద్రాలందు 8020 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు -మార్కెఫెడ్ డిఎం హరికృష్ణ

ప్రస్తుత సీజన్లో పంటసాగులకు అవసరాన్ని బట్టి జిల్లా వ్యాప్తంగా వైస్సాఆర్ రైతు భరోసా కేంద్రాలందు 8020 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు వుంచినట్లు జిల్లా మార్కెఫెడ్ డిఎం హరికృష్ణ తెలిపారు. తాళ్లూరులోని రెం డు ఆర్బికెల్లో నిల్వ వున్న ఎరువులను బుధవారం ఆకస్మికంగాతనికీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ …ప్రస్తుతం ఎక్కువగా ఏ ఎరువులు అవసరమో ఆ ఎరువుకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి ఆర్బికాల్లో నిల్వ వుంచి రైతులకు అందజేయటం జరుగుతుందన్నారు. ఎక్కువ కాలం ఆర్బికెల్లో ఎరువులు నిల్వలు వుండ కుండా చూడాల న్నారు. ప్రస్తుతం ఈసీజన్ ఇప్పటి వరకు 1800 మెట్రిక్టన్నుల ఎరువులు అమ్మటం జరిగిందని, మరో 6300టన్నుల ఎరువులు ఆర్బికె లో అందుబాటులో వుంచామన్నారు. ఆర్బికెల్లో ఎరువుల వివరాలు, నగదు చెల్లింపులు, ఎంతమేర ఎరువులు అస రమో ఇండెంట్లను పరిశీలించారు. వివిఏలు బాధ్యతగా పని చేసి రైతాంగానికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిబి.ప్రసాదరావు, ఏఈవో వెంకట రావు, విఏఏలు నాగరాజునాయక్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *