అంతరిక్ష చరిత్రలో భారత్ చరిత్ర సృష్టించిందని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలుకు అభినందనలు,శుభాకాంక్షలు తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందన్నారు.ఈ ప్రయోగం విజయవంతం ద్వారా ప్రపంచంలో మన దేశ ఖ్యాతిని పెంచిన ఇస్రోశాస్త్రవేత్తలుకు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలిపారు.జయహో ఇస్రో, జయ జయహో భారత్ అని మద్దిశెట్టి వేణుగోపాల్ నినదించారు.
