దర్శి ఎస్ఐ డి రామకృష్ణను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గోవింద ప్రసాద్ మాదిగ, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గర్నెపూడి ప్రేమ్ కుమార్ లు మాట్లాడుతూ… దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన దళిత మహిళలైన జక్కుల అనురాధ మౌనికలపై విచక్షణంగా దాడి చేసి కళ్ళల్లో కారం చల్లి…పెట్రోల్ పోసి చంపాలి అని ప్రయత్నిస్తున్న తరుణంలో …దర్శి డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అశోక్ వర్ధన్ , దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రామకోటయ్య ఆదేశాల మేరకు వెంటనే స్పందించి అర్ధరాత్రి మూడు గంటల సమయంలో తల్లి బిడ్డలను మరణం నుంచి కాపాడినందుకు కృతజ్ఞతగా సన్మానిస్తున్నామని తెలిపారు.
అలాగే మండలంలో పలు గ్రామాల్లో కూడా దళితులపై వివక్ష చూపుతున్నారని వారిని గుర్తించి వారికి తగిన రీతిలో కౌన్సిలింగ్ ఇచ్చి గ్రామాలలో ఎటువంటి అలజడలు లేకుండా అందరూ కూడా ఐక్యమత్యంతో ఉండేలాగున చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో మాదిగ సేన నియోజకవర్గ అధ్యక్షులు గట్టుపల్లి ప్రసాదు పాల్గొన్నారు.
