తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టారు – బీసీ సెల్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష – టీడీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నంది కనుమ బ్రహ్మయ్య.

చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారని ప్రకాశం జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నంది కనుమ బ్రహ్మయ్య అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ప్రకాశం జిల్లా పొన్నూరులో టిడిపి బీసీల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రకాశం జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నందికనుమ బ్రహ్మయ్య మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్ర అని ఆరోపించారు. ఏమీ లేని స్కిల్ డెవలెప్మెంట్ ప్రాజెక్టులో తప్పుడు కేసుపెట్టి చంద్రబాబునాయుడు అక్రమంగా జైల్లో పెట్టారని, ఇది ముమ్మటికి కక్ష సాధింపు చర్య అని నందికనుమ విమర్శించారు. ఏ తప్పూ చేయని నేతను తప్పు చేసినట్లు సృష్టించి తప్పుడు కేసులు బనాయించారని, రాష్ట్రాన్ని దోచిన వాళ్లే చంద్రబాబు తప్పు చేశారని చెబుతున్నారనినందికనుమ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని నందికనుమ ఘాటుగా వ్యాఖ్యానించారు. మచ్చలేని వ్యక్తిని జైల్లో పెడితే బాధపడకుండా ఉంటారా? జగన్ ప్రభుత్వం చంద్రబాబును వేధించి, హింసిస్తోందని ప్రజలు గుర్తించారని, అందుకే స్వచ్చందంగా దేశ విదేశాల్లో చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారని నందికనుమ తెలిపారు. గతంలో జగన్ ముఠా దోపిడీని సీబీఐ కూడా వాటిని రుజువు చేసిందని, అయినా వారు దర్జాగా జనంలో తిరుగుతున్నారని నందికనుమ విమర్శించారు. జాతీయస్థాయి నాయకుడిపైనే ఈ విధంగా అక్రమ కేసు బనాయిస్తే, మిగతా వారిపై కేసులు పెట్టడన్న గ్యారంటీ ఏంటి? అని నందికనుమ ప్రశ్నించారు. స్కిల్ కేసు లో చంద్రబాబు ప్రమేయం లేదని తెలిసి జగన్మోహన్ రెడ్డి మరిన్ని అక్రమ కేసులు పెట్టడానికి సిద్ధమయ్యారని నందికనుమ విమర్శించాడు ఎన్ని కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజాక్షేత్రంలో పోరాడతామని నందికనుమ బ్రహ్మయ్య స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, పొన్నలూరు మండల బీసీ నేతలు, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *