సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి సేవలు మరువలేనివి ఆయన లేని లోటు పార్టీకి తీరని లోటు – సంస్మరణ సభలో పాల్గొన్న పలువురు ప్రముఖులు -ఘన నివాళులర్పించిన వైఎస్సార్ సీపీ నాయకులు

వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, పొదిలి మార్కెట్ యార్డు కమిటీ మాజీ చైర్మన్, వెలిగండ్ల గ్రామ మాజీ సర్పంచ్ పాతకోట వెంకటకృ ష్ణారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని పార్టీ జిల్లా అధ్య క్షుడు జంకె వెంకటరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మార్కాపురం, చీరాల ఎమ్మెల్యేలు కేపీ నాగార్జురెడ్డి, కరణం బలరామకృష్ణ మూర్తి, దర్శి మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని వెలిగండ్ల గ్రామంలో కృష్ణారెడ్డి దశదిశ కర్మ సం దర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో వారు పాల్గొన్నారు. కృష్ణారెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ.. గత 50 ఏళ్లుగా కృష్ణారెడ్డి కుటుంబం రాజకీయాల్లో ఉంటూ సేవా కార్యక్ర మాలు చేపట్టిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానిగా ఉంటూ పార్టీకి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కృష్ణారెడ్డి కుమార్తె చీరాల ఆర్డీఓ సరోజిణి, ఆయన వారసుడు, సర్పంచ్ పాతకోట వెంకటరెడ్డిని పరా మర్శించారు. నివాళులర్పించిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెన్నా హనుమారెడ్డి, అద్దంకి నియోజక వర్గ పార్టీ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య, పీసీసీ అధి కార ప్రతినిధి షేక్ సైదా, మాజీ ఎమ్మెల్యేలు పాపా రావు, నారాయణరెడ్డి, జెడ్పీటీసీలు అక్కిదాసరి ఏడు కొండలు, మారం వెంకటరెడ్డి వైస్ ఎంపీపీలు మెట్టు వెంకటరెడ్డి, ఎడమ కంటి వెంకటేశ్వర రెడ్డి, మాజీ సర్పంచ్ గర్రె శ్రీనివాసులు, సర్పంచ్ లు, ఎంపీటీ సీలు, కృష్ణారెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *