తాళ్లూరు మండలంలోని నాగం బొట్లపాలెం పంచాయతీ పరిధి అయ్యలవారిపాలెం ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఎంఈవో జి. సుబ్బయ్య తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలకు సంబంధించిన వివిధ రకాల దస్త్రాలను పరిశీలించి వాటి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. తర్వాత విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా చిన్నారులతో కలిసి భోజనం చేసి ఆహార పదార్థాల నాణ్యతను ఇరువురు ఎంఈవోలు జి. సుబ్బయ్య, ఎల్. సుధాకరరావులు పరిశీలించారు. ఈ తనిఖీలో పి. సుబ్బారెడ్డి, లక్ష్మిలు పరిశీలకులుగా వ్యవహరించగా హెచ్ఎం మంజుల, ఉపాధ్యాయిని వసంత పాల్గొన్నారు.


