జగనన్న ఆరోగ్య సురక్షలో మెరుగైన వైద్యం – దారం వారి పాలెంలో జగనన్న సురక్ష నిర్వహణ – ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి. ఎంపీపీ తాటికొండ, జెడ్పీటీసీ మారం

ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోని రాగానే ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసి నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం అందించారని నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల చెంతకు ఆరోగ్య సేవలు చేర్చటంతో పాటు అనేక పథకాలు అందించి ఆర్ధిక చేయూత అందించారని వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, మంచాల ప్రియాంక నాగార్జున రెడ్డిలు పేర్కోన్నారు. దారం వారం వారి పాలెంలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, మంచాల ప్రియాంక నాగార్జున రెడ్డి, సర్పంచి మంచాల వెంకటేశ్వర రెడ్డి, జెసీఎస్ మండల కన్వీనర్ యాడిక శ్రీనివాస రెడ్డి, సొసైటీ చైర్మన్ మంచాల వలసా రెడ్డిలు ముఖ్య అతిథిలుగా పాల్గొని జగనన్న సురక్షను ప్రారంభించారు. వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి, వైద్య బృందం ఆధ్వర్యంలో 350 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసారు. 128 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 27 మందికి కంటి పంపిణీ చేసారు. ఎంపీడీఓ కె.వై కీర్తి, ఎంఈఓ జి. సుబ్బయ్య, పలు గ్రామాల సర్పంచిలు పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, వలి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, మాజీ ఎఎంసీ డైరెక్టర్ రమణా రెడ్డి, ఉప సర్పంచి ఇంద్ర సేనా రెడ్డి, కెవీ పాలెం జెసీఎస్ కన్వీనర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *