వలంటీరు వ్యవస్థతో ప్రజలు మెరుగైన సేవలు అందుతున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. వలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లకు సేవ వజ్ర, సేవా రత్న, పురష్కారాల అవార్డులు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి, జెడ్పిటిసి రత్నరాజు, వైసిపి మండల అధ్యక్షుడు బిజ్జం సుబ్బారెడ్డి, మాజీ అధ్యక్షులు సూదిదేవర అంజయ్య, దర్శి ఎఎంసి మాజీ చైర్మన్ కెవి.రెడ్డి, తహశీల్దారు మధుబాబు, నాయకులు శ్రీనివాసరెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.



