సికింద్రబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయం లో జరుగుతున్న కోటి కుంకుమార్చన కార్యక్రమంలో రామ్ గోపాల్ పేట కార్పొరేటర్ చీరె సుచిత్ర పాల్గొని పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మాఘ మాసంలో ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్న కోటి కుంకుమార్చన పూజా కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.ఇందులో భాగంగా ఆలయంలో బ్రాహ్మణ మహిళలకు పసుపు కుంకుమలు సమర్పించి సుహాసిని అర్చన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లో బిజెపి పార్టీ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ పాల్గొని పూజలు నిర్వహించారు.పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

