శ్రీ బాల రాముని దర్శంనంతో తనువు, మనసు పులకితమైనది – అయోధ్య నుండి వచ్చిన విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు.

అయోధ్య లో శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారిచే నిర్మించబడిన బాల రాముని మందిరం అద్భుతమైన కట్టడం అనచ్చు. అంతేకాదు ప్రపంచ కట్టడాల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. ఈ అద్భుతమైన కట్టడంలో బాలరాముని రెండు రోజులు దర్శించుకున్నాను. ఆ కట్టడ గోడలను చేతితో తడిమాను, కనులారా చూసాను. అద్భుతమైన శిలా సంపద కనబడుతుంది. ఈ అద్భుత కట్టడం తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు చెప్పినట్లుగా ఒక్కరోజులో అయినది కాదు ఎప్పుడైతే న్యాయస్థానంలో మనకు విజయం తథ్యం అన్న భావన ఏర్పడినప్పటి నుంచే వారు ఆ మందిర గోడలను స్తంభాలను ముందుగానే తయారు చేసుకొని నిర్మించారు. సరి అయిన ముహూర్తానికి పింక్ మార్బుల్ తో నిర్మితమైన మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్టను ప్రధాని మోదీ చేతులమీదుగా జనవరి 22వ తేది జరిగినది. పనులు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. శిల్పులు ఎంతో నిష్ఠతో, ఏకాగ్రతతో అవసరమైన పనిముట్లతో అద్భుతముగా ఏమాత్రం వీసమెత్తు తేడా లేకుండా వేలాది మంది భక్తుల శ్రీరామ గోషల నడుమ ఏమాత్రం చంచల మనస్కులు కాకుండా శ్రీరాముని పై అంకితమై భక్తితో తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారు. మరింతగా మెరుగులు దిద్దుతున్నారు. ఇంతటి భవ్య దివ్య అయోధ్య దాంని దర్శించుకోవడం మన అదృష్టంగా నేను భావిస్తాను. కారణం 500 సం.లకు పైగా హిందువులు ధర్మపోరాటం చేస్తే… న్యాయ సమ్మతంముగా ఆ స్థలము రామ జన్మ భూమి దే అని న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మనం జీవించి ఉన్న సమయంలో అద్భుత మందిర నిర్మాణం జరగడం, ఆ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగడం, దర్శించుకోవడం మనం అదృష్టం చేసుకోవడమేనని ప్రాంత సత్సంగ ప్రముఖు సోమ సుబ్బారావు పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పరిషత్ కార్యకర్తలు ఉత్సాహంగా శ్రీరామ నామ జపం చేస్తూ తాళాలు ఖంజరులు మ్రోగిస్తూ శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో సందడి చేశారు తమ భక్తి భావాన్ని ప్రస్ఫుటంగా ప్రదర్శించారు.

దక్షిణాంధ్ర ప్రాంత విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అందరినీ కలుపుకుంటూ ఐఆర్సిటిసి వారు ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆస్తా ట్రైన్ ద్వారా 18వ తేదీ అయోధ్య బయలుదేరిన కార్యకర్తలు 23వ తేదీ ఉదయం తిరిగి ఒంగోలు చేరారు. ఈ సందర్భంగా సోమ సుబ్బారావు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం నిర్మాణం ద్వారా దేశంలో ఆధ్యాత్మికత మరింతగా జాగృత మైనదని, అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వేలాది మందికి బసకు తీర్థక్షేత్రపురాన్ని నిర్మించి వచ్చిన భక్తులకు అక్కడ వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు. వేలాదిమంది అయోధ్య వచ్చిన మందిరంలోని స్వామివారి దర్శనం ఒక అరగంటలోనే పూర్తయిపోతుంది అని తెలిపారు. ప్రసిద్ధ దేవాలయాలైన హనుమాన్ గర్హి, వాల్మీకి భవన్ రత్న సింహాసనం కణక్భవన్ నాగేశ్వరరావు చోటి దేవ్కలి ఆలయం మధ్గజేంద్ర ఆలయం లవకుశ మందిరం కాలేరా మందిరం మణి పర్వతం లక్ష్మణ్ కిల్ల సరయు ఘాట్, లతా మంగేష్కర్ చౌరస్తా, ఇలా ఎన్నో ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయని తెలిపారు.

సందర్భంగా భైరవేశ్వర స్వామి మాట్లాడుతూ మీడియాలోని కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు అయోధ్యలో విపరీతమైన ధరలు వసూలు చేస్తున్నారని ప్రసారం చేయడం జరిగినది అవన్నీ ఏమాత్రం నిజం కాదు. స్వామివారి దర్శనార్థం అయోధ్య వెళ్లి వచ్చిన వాడిగా నేను చెప్తున్నాను, అల్పాహారం, టీ, వేడి నీరు భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. స్వామివారి దర్శనం, వస్తు భద్రత అన్నింటినీ అన్ని విధాలుగా సాఫీగా జరిగేటట్లు తీర్థ ట్రస్ట్ వారు ఏర్పాటు చేశారని తెలిపారు. అంతేకాకుండా మన నగరాల్లోని రవాణా సదుపాయాలైన ఆటో ధర కంటే కూడా తక్కువకే మనకు అక్కడ ప్రయాణ సాధనాలు లభిస్తున్నాయి. కాబట్టి ఏ ఒక్కరు సోషల్ మీడియా రాతలను నమ్మ వద్దని విజ్ఞప్తి చేశారు.

విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి గడ్డం శ్రీనివాసులు మాట్లాడుతూ అయోధ్య బాల రాముని దర్శనార్థం ఏర్పాటు చేసిన విధానం అద్భుతంగా ఉందని, ఎలాంటి ఆటంకాలు జరగకుండా స్వామివారి దర్శనం అలాగే ఈ ప్రయాణం ఆద్యంతం చాలా సాఫీగా సాగింది. ఈ సందర్భంగా ఐఆర్సిటిసి వారికి సెక్యూరిటీ సిబ్బందికి విశ్వహిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంతం తరఫున ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *