రేపు 41 వేల కోట్లతో 2000 లకు పైగా రైల్వే మౌళిక సౌకర్యాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేయనున్న ప్రధాని

  • అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద రూ.19000 వేల కోట్ల విలువ గల 553 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన
  • పునరాభివృద్ధి చేయబడిన గోమతి నగర్‌ రైల్వే స్టేషన్‌కు ప్రారంభోత్సవం
  • దేశవ్యాప్తంగా రూ. 21,520 కోట్ల విలువ గల 1500 రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిలు మరియు అండర్‌పాసులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం

26 ఫిబ్రవరి, 2024 సోమవారం రోజున మధ్యాహ్నం 12.30 గం।టలకు దేశవ్యాప్తంగా రూ.41,000 కోట్ల విలువ గల సుమారు 2000 రైల్వే మౌళిక సౌకర్యాల కల్పన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేయనున్నారు.
ప్రధాన మంత్రి తరచుగా రైల్వే స్టేషన్లలో ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పన ఆవశ్యకతను నొక్కి చెబుతున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ఆయన అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథక కింద 553 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయడం పెద్ద ముందడుగు. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ స్టేషన్లను రూ.19,000 కోట్లతో పునరాభివృద్ధి చేయబడతాయి. ఈ స్టేషన్లు నగరాల ఇరువైపులను కలుపుతూ ‘సిటీ కేంద్రాలుగా’ వ్యవహరిస్తాయి. ఈ స్టేషన్లలో రూఫ్‌ ప్లాజా, సుందరీకరణ, అంతర్గత మోడల్‌ అనుసంధానం, మెరుగుపరచబడిన ఆధునిక ముఖద్వారాలు, పిల్లల ఆటస్థలం, కియోస్క్‌లు, ఫుడ్‌ కోర్టులు, మొ. సౌకర్యాలు కల్పించబడతాయి. ఇవి పర్యావరణహితంగానూ మరియు దివ్యాంగులకు సౌకర్యవంతగానూ తీర్చిదిద్దబడతాయి. ఈ స్టేషన్‌ భవనాలను స్థానిక సంస్కృతి, వారసత్వం మరియు రూపశైలితో కూడి ఉంటాయి.
అంతేగాకుండా, ప్రధాన మంత్రి రూ.385 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి చేయబడిన ఉత్తరప్రదేశ్‌, గోమతి నగర్‌ రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారు. భవిష్యత్తులో ఈ రైల్వే స్టేషనులో పెరుగనున్న ప్రయాణికుల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని స్టేషన్‌కు వేర్వేరు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్‌ ఎయిర్‌కండిషనింగ్‌ చేయబడిన ఈ రైల్వే స్టేషనులో ఎయిర్‌ కాంకోర్స్‌, సాఫీ రాకోకలు, ఫుడ్‌ కోర్టులు మరియు సరపడా పార్కింగ్‌ ప్రదేశాల వంటి ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రధాన మంత్రి 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా రూ.21,520 కోట్ల వ్యయం కాగల 1500 రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిలు మరియు అండర్‌ పాస్‌లకు కూడా శంకుస్థాపన, ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు రైలు ప్రయాణంలో రద్దీని తగ్గించడమే కాకుండా భద్రత మరియు అనుసంధానంలో పెంపుదల, సామర్థ్యంలో పెరుగుదల మరియు సమర్థతను పెంచుతాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *