ఇంటింటికి వెళ్లండి -జరిగిన మంచిని వివరించండికార్యకర్తలకుసి.ఎం జగన్ దిశా నిర్దేశం

రానున్న 45 రోజులు మనకు చాలా కీలకం. పూర్తి విశ్వాసంతో పనిచేయండి. ప్రతి ఇంటికి వెళ్లండి. వారికి జరిగిన మంచిని వివరించండి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో మనం చాలా బలంగా ఉన్నాం. దీనిని కొనసాగించాలి.’ అని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ‘మేము సిద్ధం… మా బూత్ సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మంగళగిరిలోని సికె కన్వెన్షన్ హాలులో వైసిపి మంగళవారం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ ..గతంలో చంద్రబాబు ఇచ్చిన చెత్త హామీలు తనకు ఇంకా గుర్తున్నాయని అన్నారు. అలా ఆచరణ సాధ్యంకాని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టడం తమ అభిమతం ఎంతమాత్రం కాదని చెప్పారు. 2014లో సాద్యపడని హామీలను ప్రకటించి వాటిని అమలు చేయకుండా మేనిఫెస్టోను వెబ్సైట్ నుండి తొలగించిన ఘనత చంద్రబాబుదన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని చెప్పారు. దేశంలోనే విశ్వసనీయతకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మారుపేరుగా నిలిచిందన్నారు. అందుకే ఆచరణ సాధ్యంకాని హామీలను ఇవ్వడం లేదన్నారు. 2019లో అమలు చేయగలిగే హామీలను మాత్రమే ఇచ్చామని, అధికారంలోకి రాగానే 99 శాతం హామీలను నెరవేర్చినట్టు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 151 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో విజయం సాధించిందని, ఇపుడు 99శాతం హామీలను అమలు చేయడంతో ప్రజలు తమ వెంటే ఉన్నారని అన్నారు. వైసిపికి ఓటు వేయకపోతే సంక్షేమం ఆగిపోతుందని ప్రజలందరికీ అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాలను యూనిట్ గా తీసుకుని పనిచేయాలని చెప్పారు. బూత్ స్థాయిలో ఓటర్లను ఎన్నికలలోపు కనీసం ఐదారుసార్లు కలవాలన్నారు. వలంటీర్లు, గృహ సారథులతో సమన్వయపరచుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పథకాలతో 87 శాతం పైచిలుకు కుటుంబాలకు సంక్షేమం అందించామని, అదే విషయాన్ని ఒటర్లకు తెలియచేయాలని అన్నారు. లబ్ది పొందిన ప్రతి గడపకు వెళ్లి చేసిన మంచిని ఒట్లుగా మరల్చుకోవాలని, దానికోసం అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దర్శి నియోజ వర్గం నుండి మేము సిద్దం – మా బూత్ సిద్దం సమావేశానికి హాజరైన ఆహ్వానితులు

దర్శి నియోజక వర్గం నుండి వైఎస్సార్సీపీ దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మేము సిద్ధం- మా బూత్ సిద్ధం కార్యక్రమానికి ఆహ్వానితులు వెళ్లారు. సభ వద్ద డాక్టర్ బూచేపల్లితో కలసి ఉత్సాహంగా సెల్ఫీలు సైతం దిగారు. సభ ద్వారా అనేక విషయాలు తెలిసినవని, నూతననోత్సాహం నింపినట్లయినదని చెప్పారు. ఆహ్వానితులలో జెసీఎస్ బూత్ నియోజక వర్గ ఇన్చార్జి సోము దుర్గా రెడ్డి, ఎలక్షన్ ఆఫీస్ హెడ్ కెవీ రెడ్డి, పార్టీ మండల ప్రసిడెంట్స్ బిజ్జం సుబ్బా రెడ్డి, వై వెంకట సుబ్బయ్య, టీవీ సుబ్బా రెడ్డి, వెన్నపూస వెంకట రెడ్డి, కొత్తకోట హరీష్, జెసీఎస్ మండల ఇన్చార్జీలు బి వెంకటేశ్వర్లు, ఎదురు కోటి రెడ్డి, గుంటు పోలయ్య, ఎం సుబ్బా రెడ్డి, మేడికొండ జయంతి, యాడిక శ్రీనివాస రెడ్డిలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *