శ్రీ హర్షిణి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బుధవారం నాడు రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని శ్రీ హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ , స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రవికుమార్ మాట్లాడుతూ….. ప్రతి సంవత్సరం శ్రీహరిణి విద్యార్థులు సంవత్సరంలో 300 యూనిట్ల వరకు రక్తాన్ని సేకరించి ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు, ఇవే కాకుండా అత్యవసరంగా రక్తం కావలసిన వారికి మా విద్యార్థులు ఎప్పుడు సహాయం చేస్తుంటారు అని తెలియజేశారు, ముఖ్యఅతిథి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వర్ రావు మాట్లాడుతూ ….. ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న కళాశాల యాజమాన్యాన్ని, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి మరియు విద్యార్థుల కు అభినందనలు తెలియజేశారు. ఈ శిబిరంలో 100 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ శిబిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు, Rims బ్లడ్ బ్యాంకు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దాది ఆంజనేయులు, వైస్ ప్రిన్సిపల్ V L గారు pg కళాశాల కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి , AO ర్యాంకర్ శ్రీనివాసరావు, గిరీష్, ఇతర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు


