ఆశయంతో సేవ చేసేవారే వలంటీర్లు- డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి – వలంటీర్లను సత్కరించిన డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ

ఆశయంతో సేవ చేసే వలంటీర్లు జగనన్న సైని కులైతే.. గత ప్రభుత్వంలో ఆశతో పని చేసింది జన్మ భూమి కమిటీలని దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శి తాలూకా క్లబ్ సమావేశం హాలులో వలంటీర్లకు వందనం కార్యక్రమం బుధవారం జరిగింది. దర్శి మండలం, పట్టణంలోని సేవా వజ్ర మంచాల నాగరాజు, సేవా రత్నలు బుజ్జయ్య, జూపల్లి కనకదుర్గ, లక్కు అనీల్ కుమార్, మేడం రవిచంద్రారెడ్డి, నాదెండ్ల యల్లయ్య లను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు ఘనంగా సత్కరించారు. డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ …1250 మంది వలంటీర్లకు తమ సొంత నిధులతో రూ.5 లక్షలు బీమా అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పోస్టుల్లో వలంటీర్లకు రిజర్వేషన్ ఇవ్వాలని సీఎంను కోరుతామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే అయిన తనకు నెలకు వచ్చే పెన్షన్, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయ
మ్మకు వచ్చే లక్ష రూపాయల జీతం వలంటీర్ల ఖాతాకు వారి సంక్షేమానికి వేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి రాజన్నకు మించిన పాలన జగనన్న అందిస్తున్నారని చెప్పారు. ఎంపీపీ సుధారాణి,
షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషా, పట్టణ అధ్యక్షుడు కట్టె కోట హరీష్, వైస్ ఎంపీపీ కొరివి ముసలయ్య, సోము దుర్గారెడ్డి, జేసీఎస్ కన్వీనర్ బత్తినేని వెంకటే శ్వర్లు, నెడ్ క్యాప్ డైరెక్టర్ సానికొమ్ము తిరుపతిరెడ్డి, ఎంపీడీఓ హనుమతరావు, కమిషనర్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కేసరి రాంభూపాల్రెడ్డి, ఎంపీటీ సీల సంఘం జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి, ఆవుల జ్యోతి, జగ న్నాథం మోహన్ బాబు, తుళ్లూరి బాబూరావు, సర్పంచ్ లు రాము, సుబ్బారెడ్డి, కొరివి కోటయ్య, బా బాదం చిన్నరెడ్డి, విజయ్, వార్డు ఇంచార్జ్లు రవి, చెరుకూరి జగన్, మజ్ఞువలి, కోరె సుబ్బారావు, అం కబాబు, గంజి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పేదల పక్షపాతి జగనన్న – డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి – శింగన్నపాలెంలో బూచేపల్లికి ఘన స్వాగతం
సంక్షేమ పథకాలు అమల్లోనే ఏపీ నంబర్ వన్

పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల పక్ష పాతిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్ర ప్రసాద్ రెడ్డి అన్నారు. ముండ్లమూరు మండలంలోని శింగన్నపాలెం గ్రామంలో బుధవారం మన ఊరు మన శివన్న కార్యక్రమం నిర్వహించారు. తొలుత గ్రామంలోని పోలేరమ్మ, నాగార్పమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ, శివప్రసాద్ రెడ్డి, అయన సతీమణి నందినీ లకు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భం గా భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలను ఉద్దే శించి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న బూచేపల్లి కుటుంబంపై నమ్మకంతో పేదలకు సేవ చేసుకునే భాగ్యం మరోసారి కల్పించారన్నారు. మీ రుణం తీర్చుకునేందుకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 2004 నుంచి నియోజకవర్గ ప్రజలు బూచేప ల్లి కుటుంబంపై చూపుతున్న ప్రేమ ఆదరాభిమానాలు మరువలేనివన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రాన్ని దేశంలో మొదటిస్థానంలో నిలబెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్దే అన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యే లక్ష్యంగా ఇంగ్లిష్ మీడియంతో పాటు నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేనన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చంద్ర బాబు మహిళలను మోసం చేస్తే సీఎం జగనన్న రూ. 25వేల కోట్లు రుణమాఫీ చేసి ఆదుకున్నారని చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాబిడ్డ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ని, ఎంపీ అభ్యర్థి చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపిం చాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న సైన్యం వలంటీర్లు, మహిళలు కలిసికట్టుగా పనిచేసి జగనన్నను మళ్లీ సీఎం చేసుకునేందుకు కష్టపడాలని చెప్పారు. మండల ఇన్చార్జి కె. వెంకటరత్నం, కాపా నరసింహారెడ్డి, ఎంపీపీ సుంకర సునీతా బ్రహ్మరెడ్డి, జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు, పార్టీ మండల అధ్యక్షుడు బిజ్జం సుబ్బా రెడ్డి, మాజీ కన్వీనర్ సూదిదేవర అంజయ్య, వైస్ ఎం పీపీలు బంకా రమణమ్మ నాగిరెడ్డి, వేముల పద్మజాని కరామయ్య, సర్పంచ్ల సంఘ మాజీ అధ్యక్షుడు చిం తా శ్రీనివాసరెడ్డి, శింగన్నపాలెం సర్పంచ్ కందిమళ్ల గీతాంజలి, ఎంపీటీసీ బత్తిన కృష్ణయ్య, మాజీ సర్పం చ్ గోపనబోయిన వీరరాఘవులు, ఎంపీటీసీ తేలుకుట్ల బ్రహ్మం, నాయకులు వీరమల్లు శ్రీనివాసరావు, అచ్చు కట్ల ఎలీషా, మాతంగి ఏసేబు, మోనా, కోయి వెంకటే శ్వర్లు, పులి చిన్నా, సర్పంచ్లు గోపనబోయిన వెంకటే శ్వర్లు, గోరంట్ల రాంబాబు, వేముల పద్మా శ్రీనివా సరావు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి 50 కుటుంబాలు –
టీడీపీ నాయకులకు కండువా కప్పి వైఎస్సార్ సీపీలోకి ఆహ్వానించిన బూచేపల్లి శివప్రసాదరెడ్డి

పేదలకు జగనన్న అందించిన పథకాలుకు ఫిదా అయ్యి టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు ముండ్లమూరు మండలం నాయుడు పాలెం గ్రామానికి చెందిన తాతపూడి జయరావు, జ్యోతి నాగార్జున, పంబా అశోక్, జ్యోతి వెంక ట్రావులు తదితరులు స్పష్ట చేశారు. దర్శి వైఎ స్సార్ సీపీ కార్యాలయంలో టీడీపీకి చెందిన నాయుడుపాలెం వాసులు 50 కుటుంబాలకు చెం దిన 100 మందికి పైగా కార్యకర్తలు యనుముల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారందరికీ దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారిలో యడ్లపల్లి శ్రీమాన్, మొండితోక ఇజ్రాయేలు, కాలువ పోగిలేష్, గుండాల గుర వయ్య, యడ్లపల్లి రాంబాబు, మొండితోక అబ్రహం, మొండితోక స్టీవ, బెంజిమన్, మోజెష్ రాజేష్, విజయ్కుమార్, కోటేష్, బాలకోటయ్య ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గొర్రె శ్రీదేవి రాముడు, జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు, ఎంపీటీసీ బంకా నాగిరెడ్డి, మండల మాజీ కన్వీనర్ సూదిదేవర అంజయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *