వలంటీర్ల వ్యవస్థతో అన్ని వర్గాల పేదలకు సుపరిపాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దే అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ దర్శి ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి అన్నారు. తాళ్లూరు సచివాలయం వద్ద గురువారం వలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా ఉత్తమ వలంటీర్లను సన్మానించారు. డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ… పేదల పక్షాన నిలబడి వారి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం గా అహర్నిశలూ కష్టపడుతూ వలంటీర్లు అంది స్తున్న సేవలు అభినందనీయమన్నారు. వలంటీర్ల సంక్షేమమే లక్ష్యంగా తమ వంతు సాయంగా బూచే పల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రతి వలంటీర్‌కు ఐదు లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నామన్నారు. ఎమ్మె ల్యేగా గెలిచాక తనకి వచ్చే జీతం, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా వెంకాయమ్మకి వచ్చే జీతాన్ని కలిపి వలం టీర్ల అభివృద్ధికే ఖర్చు చేస్తామన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ వానొచ్చినా.. వరదొచ్చినా.. కష్టం అయినా.. నష్టం అయినా కరోనా కష్ట కాలంలోనూ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందించిన వలంటీర్ల సేవలు అభినందనీయమన్నారు. అనం తరం దోసకాయలపాడుకు చెందిన మెక్కమల్ల రవీంద్రరెడ్డి, లక్కవరానికి చెందిన గుంటూరు సంజీవకుమార్లను సేవా వజ్రలుగా సన్మానించారు. తుమ్మల పార్వతి, నుసుం శివకృష్ణరెడ్డి, తుపాకుల శ్రీకాంత్, బొగ్గుల అనూష, కైపు నాగతిరుమలను సేవారత్న అవార్డులతో సన్మానించారు.
రైతులకు చెక్కుల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మంజూరు చేసిన పది కోట్ల పది లక్షల నలబై వేల చెక్కును జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు వ్యవ సాయాధికారి బి. ప్రసాదరావుతో కలిసి రైతులకు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన 48,719 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ. రైతు
భరోసా, పీఎం కిసాన్ నిధులు, అటవీ భూముల రైతులకు, కౌలు రైతులకు చెక్కులు పంపిణీ చేశారు.
138 మంది దళితులకు పట్టాల పంపిణి
జగనన్న సంపూర్ణ దళిత భూహక్కు పథకం ద్వారా మండలంలోని కొర్రపాటివారిపాలెం, తాళ్లూరు గ్రామాలకు చెందిన 138 మంది దళితు లకుగాను 81 ఎకరాల భూమికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ. దర్శి ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు ఎస్సీ కార్పోరే షన్ ఈడీ అర్జున్‌నాయక్ తో కలిసి పట్టాలు పం పిణీ చేశారు. అనంతరం బూచేపల్లి వెంకా యమ్మ, డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డిలను గజమాలతో సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో మండల ఇన్చార్జ్ మద్దిరెడ్డి నరసింహారెడ్డి, చిన్నపురెడ్డి మస్తాన్ రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి,వైస్ ఎంపీపీలు ఎడమకంటి వెంకటేశ్వరరెడ్డి, మంచాల ప్రియాంకనాగార్జునరెడ్డి
వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు తూము వెంకట సుబ్బారెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ యాడిక శ్రీనివాసరెడ్డి,సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు పాలెం నాగ లక్ష్మి, , తాళ్లూరు సర్పంచ్ చార్లెస్ సర్జన్ పాల్గొన్నారు.





సిద్ధం సభను విజయవంతం చేయాలి -వైఎస్సార్ సీపీ దర్శి ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల పదో తేదీ తల పెట్టిన సిద్ధం సభను వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాప్రతి నిధులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ దర్శి ఇన్ చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. తాళ్లూరు ఎంపీపీ కార్యాలయంలో గురువారం వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో వారు సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదో తేదీన బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన నాలుగో సిద్ధం సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిం చారు. మండల ఇన్చార్జ్ ఎం. నరసింహారెడ్డి నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారన్నారు. సమావేశంలో చిన్నపురెడ్డి మస్తాన్ రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుల ఆదామ్ షరీఫ్ (బుజ్జి),వైస్ ఎంపీపీలు ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, మంచాల ప్రియాంకనాగార్జునరెడ్డి,వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి, మండల సచివాలయ కన్వీనర్ యాడిక శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, తాళ్లూరు సర్పంచ్
చార్లెస్ సర్జన్, తాళ్లూరు 2 ఎంపీటీసీ యామర్తి ప్రభుదాసు. మాజీ ఎంపీపీలు పోశం మధుసూదనరెడ్డి, గోళ్లపాటి మోషే, కోటా రామిరెడ్డి, , మండల కో ఆప్షన్ కరిముల్లా, మాజీ జెడ్పీటీసీ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కొర్రపాటి విష్ణు, సొసైట్ మాజీ అధ్యక్షుడు పులి ప్రసాదరెడ్డి, జక్కుల రామక ష్ణ, పి.దేవదానం పాల్గొన్నారు.