విఠలాపురంలో ‘జగనన్న సురక్ష 2 నిర్వహణ – 322 మందికి వైద్య పరీక్షలు -60 మందికి కంటి వైద్య పరీక్షలు

తాళ్లూరు మండలంలోని విఠలాపురం గ్రామంలో సచివాలయం వద్ద శుక్రవారం తాళ్లూరు ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల ఆధ్వర్యంలో జగనన్న సురక్ష 2వ విడత వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మండల సర్పంచ్ ల సంఘ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు. అనంతరం తాళ్లూరు ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారిణి డాక్టర్ షేక్ ఖాదర్ మస్తాన్ బి, ఇతర ప్రత్యేక వైద్యులు డాక్టర్ బి శ్వేత సమక్షంలో గ్రామంలోని వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న 322 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడమే కాక, రక్త పరీక్షలు నిర్వహించి, 60 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇతర రకాల పరీక్షలను కూడా నిర్వహించారు. అవసరం ఉన్నవారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పవన్ కుమార్, విహెచ్ఎన్ నా సూర్యునిషా బేగం హెచ్ ఎస్ రవి , హెచ్.పీ కోటేశ్వరి, ఫార్మసిస్ట్ రమేష్, వైద్య సిబ్బంది, వైద్య సహాయ సిబ్బంది, గ్రామ వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *