కలిసి కట్టుగా పని చేసి విజయం సాధిద్దాం – వైఎస్సార్ సీపీ దర్శి ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి

రానున్న ఎన్నికల్లో జగనన్నను మరోసారి ముఖ్య మంత్రిగా చేయడమే లక్ష్యంగా అందరం కలిసి పని చేద్దామని వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. తాళ్లూరు మం డలంలోని తూర్పుగంగవరంలో శుక్రవారం రాత్రి గ్రామ కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. తొలుత గుంటిగంగా భవాని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ… వైఎస్సార్ సీపీ బలోపేతమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ విజయానికి నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాల న్నారు. సమావేశంలో జిల్లా కో ఆప్షన్ సభ్యుడు షేక్ ఆదాం షరీఫ్ (బుజ్జి), మాజీ ఎంపీపీ పోశం మధుసూదనరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి, జేసీఎస్ మండల కన్వీ నర్ యాడిక శ్రీనివాసరెడ్డి, ఏఎంసి డైరెక్టర్ గుజ్జుల యోగిరెడ్డి,సొసైటీ అధ్యక్షుడు యాడిక యలమందారెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కటకంశెట్టి శ్రీను, యువజన జిల్లా ప్రధాన కార్యదర్శులుబీనాగమల్లేశ్వరరెడ్డి, జక్కుల రామకృష్ణ, సర్పంచ్ చాట్ల నాగమణి, నాయకులు చాట్ల ఇమ్మానియేలు, సర్పంచులు మందా శ్యాంసన్, చిమటా సుబ్బారావు, ఉప సర్పంచ్ వై.కాశిరెడ్డి, గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ( చందన), గోపు శ్రీనివాసరెడ్డి, పి.దేవదానం పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *