తాళ్లూరు మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన పాలెం నాగార్జున రెడ్డి అనే 30 ఏళ్ల యువ కుడు అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వైవి రమణయ్య తెలిపారు. నాగార్జున రెడ్డి తూర్పుగంగవరంలో ఫర్నిచర్ షాపు నిర్వహి స్తున్నాడు. గత నెల 19వ తేదీన సొంత పని మీద ఒంగోలు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో బంధువుల వద్ద వెతికారు. ఆచూకీ లేక పోవడంతో శనివారం సోదరుడు రాజశేఖరరెడ్డి ఫిర్యాదు మేరకు నాగార్జునరెడ్డి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
