జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని తూర్పు గంగవరం పిహెచ్సి వైద్యాధికారి సిహెచ్ శ్రీకాంత్ రెడ్డి కోరారు . వైద్యురాలు కే. తూర్పు గంగవరం పీహెచ్సీ పరిధిలో శనివారం వైద్యులు శ్రీకాంత్ రెడ్డి మౌనిక, వైద్య సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. పీహెచ్సీ పరిధిలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు 2741 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. కనుక అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల వయస్సు లోపు చిన్నారులకు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సంచార జాతుల వారు రవాణా చేసే ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు అందే విధంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు సుశీల, చంద్రమ్మ, ఏఎన్ఎంలు, ఆశాలు, సిబ్బంది పాల్గొన్నారు.
