గ్రామంలో ఉన్న ప్రతి సమస్యపై ప్రత్యేక దృ ష్టి సారిస్తా .. ఏ సమస్య ఉన్నా నాతో చెప్పండి.. అన్నీ పరిష్కారం చేస్తా.. మీ అందరికీ అండగా ఉంటా.. అని దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శి మండలంలోని రాజంపల్లి పంచాయతీ పరిధి అన్నవరప్పాడులో గ్రామస్తులతో శనివారం ఆయన సమావేశమ య్యారు. అనంతరం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొ న్నారు. వారి సమస్యలు అర్జీల రూపంలో స్వీకరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను ప్రతి పేదవారు గమనించారన్నారు. పేద లకు ఎటువంటి అవసరం వచ్చినా నేరుగా నా ఇంటికి వచ్చి సమస్య పరిష్కారం చేసుకోవచ్చని చెప్పారు. పేదల సమస్యల పరిష్కారానికి బూచేపల్లి తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయన్నారు. ముస్లింల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అం దరూ కలిసి మెలిసి పని చేసి తమ మద్దతు తెలిపి వైఎస్సార్ సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. ఎంపీపీ సుధా అచ్చయ్య, సర్పం చ్ అన్నపూర్ణమ్మ, జేసీఎస్ కన్వీనర్ బత్తినేని వెంక టేశ్వర్లు, పార్టీ మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి (మహేష్ ),విజయ్, బండారు బాబు, షేక్ కార్పొరే షన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషా, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, కోరె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.




