సొంతింటి కల జగనన్నతో సాకారం – వైఎస్సార్ సీపీ దర్శి ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి -జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మతో కలిసి దర్శిలో రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ

పేదల సొంత ఇంటి కలను సాకారం చేసిన జగనన్న రుణం తీర్చుకోలేనిదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ దర్శి ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. దర్శి రెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో తహసీల్దార్ సుజాత అధ్యక్షతన
సోమవారం దర్శి మండలంలోని పేదలకు ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలు సోమవారం అందజే శారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి దర్శన్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ.. దర్శి నియో జవర్గంలో 6,425 మంది పేదలకు పట్టాలివ్వగా
దర్శి మండలంలో 3,262 మందికి లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఒక్కో ఇంటికి రూ.2.70 లక్షల చొప్పున రూ.173 కోట్లకు పైచిలుకు నిర్మాణానికి కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్ దే అని స్పష్టం చేశారు. కేవలం పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జగనన్న పాలనా దక్షతకు నిదర్శనమ న్నారు. మాటమీద నిలబడే ప్రభుత్వం ఎవరిదో.. మాట ఇచ్చిన తప్పిన ప్రభుత్వం ఎవరిదో అక్క చెల్లెమ్మలు గమనించాలని సూచించారు. చంద్రబాబు బంగారు బిస్కెట్లు కూడా ఇస్తానని చెబుతాడు కానీ గుడ్ డే బిస్కెట్ కూడా పేదలకు ఇవ్వని వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. దర్శి మున్సిపాలిటీలో రూ. 100 కోట్ల వ్యయంతో ఇంటింటికి తాగునీటి పథకం టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు.
కాపు నేస్తం ద్వారా కాపులకు ఎన్నడూ లేని మేలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు. పేదలను లక్షాధికారులను చేయాలనే లక్ష్యంతో నియోజకవర్గంలో లబ్ధిదా రులకు రూ.350 కోట్లు డబ్బు అందిస్తే చంద్ర బాబు మాత్రం ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారని విమర్శించడం సిగ్గుచేటన్నారు. పట్టాలు ఇంకా అందనివారికి తప్పనిసరిగా స్థలం మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా, ఎంపీపీ సుధారాణి, మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి (మహేష్ ),నగర పంచాయతీ కమిషనర్ మహేష్, ఎంపీడీఓ హను మంతరావు, డీటీ రవిశంకర్, వైస్ ఎంపీపీలు సోము దుర్గారెడ్డి, కొరివి ముసలయ్య, డైరెక్టర్లు కుమ్మిత అంజిరెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి, విమల రామకృష్ణ, ఎంపీటీసీలు సుబ్బులు, రాచ పూడి రత్నం, బండి గోపాల్ రెడ్డి, సర్పంచ్లు కేసరి రాంభూపాల్ రెడ్డి, సుబ్బారెడ్డి, కౌన్సిలర్లు జగన్నాథం మోహనాబాబు, పట్టణ అధ్యక్షుడు కట్టె కోట హరీష్, జేసీఎస్ కన్వీనర్ బత్తినేని వెంక టేశ్వర్లు, పాణెం కృష్ణారెడ్డి, కోరే సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కురిచేడు మండలంలో …

జగనన్నతోనే పేదలందరికీ న్యాయం -జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి

పేదలందరికీ న్యాయం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే సాధ్యమవుతుందని రాష్ట్రంలో 30 లక్షలకు పైగా పట్టాలు ఇచ్చి నిరూపించారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ, నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. కురిచేడు మండలానికి చెందిన 467 మందికి స్థలం పట్టాలు వెంకాయమ్మ, శివ ప్రసాద్ రెడ్డి సోమవారం అందజేశారు. ఈ సం లదర్భంగా వారు మాట్లాడుతూ నవరత్నాలు పేదల పాలిట వరాలని చెప్పారు. పేదల సొంతింటి కల నిజం చేయడంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మో హన్ రెడ్డి ప్రతి పేదవానికి ఉచితంగా స్థలం, రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్తో పాటు
ఇళ్లు కట్టుకునే వారికి రూ. 2.70 లక్షలు వరకు అం దజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఏవీ సుధాకర్, ఎంపీడీఓ సీతారామయ్య, ఈఓఆర్డీ ప్రసాద్, జెడ్పీటీసీ నుసుం నాగిరెడ్డి, జేసీఎస్ కన్వీ నర్ మేరువ సుబ్బారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు పోతిరెడ్డి నాగిరెడ్డి, మాజీ అధ్యక్షుడు ఊట్ల వెంకటే శ్వర్లు, గోగులమూడి లింగారెడ్డి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కేసనపల్లి నాగేశ్వరరావు, సర్పంచ్ కేసనపల్లి కృష్ణయ్య, ఎంపీటీసీలు, ఇతర నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *