కంది సాగు చేసిన రైతులు పంటను రైతు భరోసా కేంద్రాల -1 పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించు కోవచ్చని వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు, నాగంబొట్లపాలెం గ్రామాల్లో కందుల కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మండలంలో ఖరీఫ్ లో 1445 ఎకరాల్లో కంది సాగు చేశారన్నారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందజేస్తామన్నారు. సొసైటీ సీఈఓ శ్రీనివాసరెడ్డి, వీఏఏలు అజ్మీర్, రైతులు పాల్గొన్నారు. ముండ్లమూరు మండలంలోని పెద ఉల్లగల్లులో కందుల కొను గోలు కేంద్రాన్ని సర్పంచ్ జనమాల నాగేంద్రం పిచ్చయ్యతో కలిసి ఏఓ ఫరూక్ ప్రారంభిం చారు. క్వింటాకి రూ.9,391 చెల్లిస్తామన్నారు. సొసైటీ అధ్యక్షుడు కె. వెంకటరెడ్డి, డైరెక్టర్ జిల్లెలమూడి శివయ్య, సీఈఓ కేవీవీ నర సయ్య, వీఏఏ ఆంజనేయులు పాల్గొన్నారు.
