అంతర్జాతీయ మహిళా దినోత్సవము సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం గురుకుల పాఠశాలలో ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి. విజయరావు ఆధ్వర్యంలో “నారి శక్తి వందన్ యాత్ర” సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో భవిష్యత్ తరం యువతులు ప్రస్తుత సమాజంలో ఎలా ఉండాలి అనే విషయం పై రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ స్కూల్ విద్యార్ధినులకు సోదాహరణంతో వివరించారు.
వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు అంతా మీ చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ ఆర్థిక సామాజిక రక్షణ ఆరోగ్య రంగాలలో పరిణితి సాధించి దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. బిఎస్ఎఫ్ కమాండెంట్ గా ఒక మహిళ ఉన్నారని వారి కనుసన్నల్లో వందలాది మంది సైనికులు దేశ రక్షణలో పాల్గొంటున్నారని మరియు దేశ రాష్ట్రపతిగా మహిళామూర్తి ద్రౌపది మూర్ము స్ఫూర్తితో విద్యార్థినులందరూ ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని తమ గమ్యం చేరే విధంగా కృషి చేయాలన్నారు.
అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రమాదేవి ని మహిళా మోర్చా తరపున ఘనంగా సత్కరించారు.
సమావేశంలో భాజపా ప్రకాశం జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి, ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మలినేని గీతాంజలి, ప్రకాశం జిల్లా ఇంచార్జ్ రవిశంకర్, ప్రకాశం జిల్లా మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్ తిగల సత్యవతి, జిల్లా కార్యదర్శి జువ్విగుంట కోటేశ్వరి,
జ్యోతి, పిన్నంటి తిరుమల, జజ్జర కృష్ణవేణి, మద్దు అరవింద లక్ష్మి, సుల్తాన్, లక్ష్మి, అజంతా, కుమారి, ప్రియరాధిక, నాయకులు బాలకోటయ్య, కుంచాల ప్రసాదు, పెరిక లక్ష్మణ్, మహేషు, రాజశేఖర్, వెంకట శివ, అల్లరి రామయ్య, ధనిశెట్టి రామునాయుడు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


