జిల్లాలో పలు గ్రామాలలో పొగాకు విత్తనాలను సెంట్రల్ టుబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిటిఆర్ఎ) బృందం బుధవారం పరిశీలించారు. జిల్లాలో సీటిఆర్ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తికి పలు గ్రామాలలో 150 ఎకరాల వరకు రైతులతో ఒప్పదం చేసుకుని అందుకు కావలసిన విత్తనాలను, గ్రోయింగ్ మందులను అందించారు. జిల్లాలో విఠలాపురం, చండ్రపాడు, కందులూరు గ్రామాలలో పలు తోటలను పరిశీలించి నాణ్యమైన విత్తనోత్పత్తికి రైతులు చేసిన కృషిని పాటించిన పద్దతులను సీటిఆర్ డైరెక్టర్ మాంగంటి శేషు మాధవ్, హెడ్ డాక్టర్ ఎం అనురాధ, శాస్త్రవెత్త కె గంగా ధర్ తెలుసుకున్నారు. సాంకేతిక సిబ్బంది లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
