పొగాకు గ్రేడింగ్ లో ఉత్తయ యాజమాన్య పద్ధతులు పాటించాలని ఒంగోలు -1 వేలం నిర్వాహణాధికారి కోవి రామక్రిష్ణ కోరారు. వెంకటరాజు పాలెంలో బుధవారం పొగాకు సాగు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 2023-24 సంవత్సర పంట కాలంలో వెంకట రాజు పాలెం గ్రామంను ఆదర్శ గ్రామంగా ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పారు. గ్రేడింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిచారు. ఐటీసీ మెనేజర్ వెంకటేష్, పీఎస్ఎన్హెచ్ మెనేజర్ రామాంజనేయులు, జీపీఐ మెనేజర్ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
