ఆంధ్రప్రదేశ్ నాన్- గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్ ఫెడరేషన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా చైర్మన్ గా తన్నీరు రమేష్‌బాబు ఎన్నికైనారు. ఒంగోలులోని
సంతపేటలోని పశుసంవర్థక శాఖ ఆవరణలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ నాన్- గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్ ఫెడరేషన్, మూడు సంఘాల అనుబంధం (విఏఎల్‌ఎస్‌ఏ, జెవిఓ, వి. ఎల్ఎ) ఎన్నికలు నిర్వహించారు.
●పలు కమీటీల బాధ్యులు వీరే..
ఎపీఎన్ఐవిఎఫ్ చైర్మన్ గా తన్నీరు రమేష్‌బాబు. కో చైర్మన్‌గా కె. శంకరరావు, వైస్ చైర్మన్లుగా కె. రాజేశ్వరి, ఖాతా మొజాహిద్, ఎం. రంగనాథ, సెక్రటరీలుగా డి. క్రిష్ణాంజనేయులు, జాయింట్ సెక్రటరీగా ఎం కోటేశ్వరరావు, రవిచంద్రకుమార్, చరణ్ కుమార్, కె. కుమారి, టి.శ్యామలా కుమారి, కోశాధికారిగా ప్రభావతి ఎన్నికైనారు.
జెవీఓ అండ్ వి. ఎల్డీఓ అసోషియేషన్ అధ్యక్షులుగా వి. రమేష్‌బాబు, అనోషియేట్ ప్రసిడెంట్ కె రాజేశ్వరి. వైస్ ప్రసిడెంట్లుగా రంగనాయకులు, ఎం హనుమంతరావు, ఎస్ శ్రీను, సెక్రటరీగా ఎం కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీలుగా ఎం. ప్రభాకర్, సుశీల, కోశాధికారిగా పద్మావతి ఎన్నికైనారు.
లైవ్ స్టాక్ అసిస్టెంట్ అసోషియేషన్ ప్రసిడెంట్‌గా డి క్రిష్ణాంజనేయులు, అసోషియేట్ ప్రసిడెంట్‌గా కాజామొజహిద్, వైస్ ప్రసిడెంట్‌గా షేక్ ఇస్మాయిల్, రాకేష్ యాదవ్, యం. రవలి, సెక్రటరీ పి. రవిచంద్రకుమార్, జాయింట్ సెక్రటరీలుగా కె ఖాదర్ భాషా, ఆర్వెంకటేశ్వర్లు నాయక్, కోశాధికారిగా కె కుమారి ఎన్నికైనారు.
వెటర్నరీ అసిస్టెంట్ అసోషియేషన్ ప్రసిడెంట్‌గా కోవూరి శంకరావు, అసోషియేట్ ప్రసిడెంట్‌గా యం రంగనాథ్, వైస్ ప్రసిడెంట్‌గా సిహెచ్ స్వాతి, పి. భవాని, ఎస్ పూర్ణ చంద్రరావు, సెక్రటరీగా బి. చరణ్ కుమార్, వై వెంకటరావు, కోశాధికారిగా టి. శ్యామలాకుమారి ఎన్నికైనారు.
మూడు సంఘాల (విఏఎల్‌ఎస్‌ఏ, జెవిఓ, వి. ఎల్ఎ) సభ్యులు మొత్తం 170 మంది ఈఎన్నికలలో పాల్గొనడం జరిగింది. ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ నాన్- డ్రాడ్యుయేట్ వెటర్నేరియన్ ఫెడరేషన్ అమరావతి చైర్మన్ సేవా నాయక్, సెక్రటరీ జి రామక్రిష్ణ ఆధ్వర్యంలో మూడు సంఘాల రాష్ట్ర ఎన్నికల అధికారి బి. రామక్రిష్ణ, బి. గోవింద రాజు, ఎన్ రాఘవరావు సమక్షంలో నిర్వహించారు.



