పశుసంవర్ధశాఖ ద్వారా అందిస్తున్న సేవలు పశుపోషకులకు తెలియజెసి మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర పశుసంవర్థశాఖ సంచాలకులు డాక్టర్ అమరేంద్రకుమార్ కోరారు. తూర్పుగంగవరంలోని పశువైద్యకేంద్రంలో గురువారం దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు విహెచ్ఎలకు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్థశాఖ సంచాలకులు డాక్టర్ అమరేంద్ర కుమార్ మాట్లాడుతూ పశుసంవర్ధశాఖ ద్వారా అందిస్తున్న వ్యాక్సినేషన్, భీమా, గడ్డివిత్తనాల పంపిణీలపై పశుపోషకులను అప్రమత్తం చెయ్యాలని కోరారు. జిల్లా సంయుక్త సంయాలకులు డాక్టర్ బేబి రాణి మాట్లాడుతూ ప్రతి పశుసంవర్ధక శాఖ సిబ్బంది తమ విధుల పట్ల చిత్తశుద్దితో పనిచెయ్యాలని క్షేత్ర స్థాయిలో పశుపోషకులకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం గ్రామానికి చెందిన పశుపోషకురాలు యత్తపు తిరపతమ్మకు పశుభీమా పథకం సర్టిఫికేట్ అందించారు. కార్యక్రమంలో ఉప సంచాలకులు డాక్టర్ రమేష్‌బాబు, సహాయ సంచాలకులు డాక్టర్ పురుషోత్తం రాజు, తూర్పుగంగవరం పశువైద్యాధికారి డాక్టర్ ఎం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

