తనను ఉద్యోగం నుంచి ఎందుకు తీసి వేయించావని ప్రశ్నించినందుకు ఆగ్రహంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ కులంపేరుతో దూషిం చి దాడి చేసిన ఘటనపై శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పో లీసుల కథనం మేరకు.. శివరాంపురం గ్రామానికి చెందిన కోండ్రు రాంబాబు తాళ్లూ రు ప్రభుత్వ మద్యం షాపులో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నారు. ఇదే దుకాణంలో చింత పాలెంకు చెందిన పోటు కోటేశ్వరరావు సూపర్వైజర్గా పని చేస్తున్నారు. మద్యం బాటిల్‌ను ధర కంటే అధికంగా డబ్బులు వసూలు చేసి తనకు ఇవ్వాలని సేల్మన్ రాంబాబుకు సూపర్వైజర్ కోటేశ్వరరావు చెప్పగా అంగీకరించక పోవడంతో అధికా రులకు ఉన్నవీలేనివి చాడీలు చెప్పి 18వ తేదీ నుంచి ఉద్యోగం తీయించారు. ఈనెల 22వ తేదీన రాంబాబు తమగ్రామం నుంచి చీమకుర్తి వెళుతుండగా మార్గమధ్యంలో కోటేశ్వరరావు కన్పించారు. ఎదురుపడ్డ కోటేశ్వరరావును తనను ఎందుకు ఉద్యోగం నుంచి తీసి వేయించావని ప్రశ్నించడంతో తననే ప్రశ్నిస్తావా అంటూ ఆగ్రహంతో రాంబాబును కులంపేరుతో దూషించి రాళ్లతో కోట్టి గాయపరిచారు. తీవ్రగాయాల యిన రాంబాబును చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. బాధితు డు రాంబాబు ఇచ్చిన సమాచారాన్ని రిమ్స్ వైద్యులు తాళ్లూరు పోలీస్ స్టేషన్‌కు పంపగా ఎస్సై వైవీ రమణయ్య కులదూషణ కేసు నమోదు చేశారు.
తాళ్లూరు మండలం లో కులంపేరుతో దూషించి దాడి చేసిన వ్యక్తిపై కేసు
24
Mar