మనసున్న నేత..జగనన్నడాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి

ప్రజల సమస్యలు తెలుసుకుని వారి అవసరాలకు అనుగుణంగా పని చేసే మనసున్న నేత ముఖ్యమంత్రి జగనన్న అని దర్శి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. దొనకొండ మండలంలోని పోలేపల్లి పంచాయతీ పరిధి రామిరెడ్డిపల్లి, పుచ్చకాయలపల్లి, ఎస్సీ కాలనీ, కం భంవారిపల్లి, కందులవారిపల్లి గ్రామాల్లో మన పోలే పల్లెకు మన శివన్న కార్యక్రమం సోమవారం జరిగిం ది. మహిళలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ శివప్రసాదరెడ్డికి హారతులిచ్చి స్వాగతం పలికారు. పుచ్చకాయలపల్లిలో రామాల యంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శివన్న మాట్లాడుతూ ….గ్రామాల్లో విద్యుత్ స్తంభాల సమస్య ఉన్నట్లు తమ దృష్టికి తెచ్చారని, నాలుగు రోజుల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తా మన్నారు. గుడి నిర్మాణానికి విరాళం ఇస్తామని చెప్పారు. బీసీ సోదరులు తమ కుటుంబం వారని, యాదవులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటా మన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవ రత్నాల్లో నూటికి నూరు శాతం పూర్తి చేశారన్నారు. ఎన్ని కష్టాలు పడినా మా పేద ప్రజలను గుండెల్లో దాచుకున్న వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని, వారికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెలా 1వ తేదీఉదయం 6 గంటలకే వలంటీర్ల ద్వారా పింఛన్లు దజేస్తున్నారని, చంద్రబాబు పగతో అడ్డుకున్నారని మండిపడ్డారు. గడిచిన 59 నెలల్లో జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. జగనన్న సం క్షేమం, అభివృద్ధే అంజెండాతో ప్రజల వద్దకు వెళ్తున్నారని, అలాంటి వ్యక్తిని మళ్లీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జిల్లా పరిషత్ నిధులతో గ్రామాలు అభివృద్ధి చేశామని, ఇంకా అభివృద్ధి చేసేం దుకు కృషి చేస్తామని శివప్రసాదరెడ్డి అన్నారు. జిల్లా
పరిషత్ చైర్పర్సన్ వెంకాయమ్మ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డికి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె పేరు పేరునా ప్రజలను కోరారు. మండల ఇన్చార్జి కాపా రమణారెడ్డి, ఎంపీపీ బొరిగొర్ల ఉషామురళా, మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణా రెడ్డి, సర్పంచ్ యద్దనపూడి జాన్ ప్రకాష్, మాజీ సర్పంచ్ దేవేండ్ల వెంకట సుబ్బయ్య, జేసీఎస్ కన్వీనర్ గుంటు పోలయ్య, కందుల వెంకటేశ్వరరెడ్డి, కందుల రామకృష్ణారెడ్డి, కోటిరెడ్డి, ముడమంచు బూషయ్య, మంగయ్య, పెద్ద బొర్రయ్య, పెసల చిన్న నారాయణరెడ్డి, రామిరెడ్డి, చిన్నప్పరెడ్డి, కొత్తం వెంక టరెడ్డి, యర్రంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కంభం వెంకటరా మిరెడ్డి, రామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నిమ్మకాయల కొం డలు, వెంకటేశ్వర్లు, ముడమంచు కృష్ణమూర్తి, కాలూరి రమణయ్య, ముజాయిద్, గుంటు ఇశ్రా యేల్, బత్తుల వెంకట సుబ్బయ్య యాదవ్, తాటిగిరి మదన్, పిక్కిలి అంకయ్య, నాగరాజు, గుడిపాటి నాసరయ్య, మోడి బాలయ్య, మోషే, మువ్వా రమణయ్య పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *