అండర్ 14 విభాగంలో తాళ్లూరు శ్రీసరస్వతిహై స్కూల్ విద్యార్థి జి .ప్రజ్వల్ అండర్ 14 విభాగంలో జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక కావడం జరిగింది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలోని పల్లవి ఇంటర్నేషనల్ ప్రాంగణంలో జరిగిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో తాళ్లూరు శ్రీ సరస్వతి హైస్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభకనబరిచి రాష్ట్రస్థాయిలో రన్నర్స్ గా నిలవడం జరిగింది . ఈ జట్టులో అత్యుత్తమ ర్యాంకు సాధించిన ప్రజ్వల్ జాతీయస్థాయి జట్టుకు ఎంపిక చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు తమ పాఠశాల విద్యార్థి జాతీయ జట్టుకు ఎంపిక కావడం పట్ల శ్రీ సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఏ.వి. రమణారెడ్డి హెచ్.ఎం .శ్రీరామ మూర్తి పి.ఈ.టి బిజ్జం వికాస్ విద్యార్థులను అభినందించడం జరిగింది.
