అవ్వాతాతలపై రాజకీయాలు తగవు – వైఎస్సార్ సీపీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి

పేద, బడుగు, బలహీన వర్గాల్లోని అవ్వాతాతలపై చంద్రబాబునాయుడు కుటిల రాజకీయాలు మానుకోవాలని వైఎస్సార్ సీపీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి అన్నారు. మండలంలోని బెల్లంకొండవారిపాలెం , తోటవెంగనపాలెం, దోసకాయలపాడు గ్రామాల్లో బుధవారం రాత్రి మన ఊరికి మన శివన్న ఎన్నికల ప్రచారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మతో కలిసి నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు పూల వర్షం కురిపిస్తూ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో నాయకులు క్రేన్ సాయంతో గజమాలలతో స్వాగతం పలికారు. – బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ జగనన్న తనపై నమ్మకంతో దర్శి సీటు కేటాయించినందుకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. జగనన్న కోసం వీరవిధేయుడిగా పని చేస్తానన్నారు. చంద్ర బాబునాయుడు వలంటీర్ల వ్యవస్థపై కుట్ర పన్ని అవ్వతాతలకు అందే పెన్షన్ ను ఇంటికి అందకుండా రాజకీయాలు చేయడం తగదన్నారు. పింఛన్దారులు ఉదయం నుంచి మండుటెండలో నరక యాతన పడుతుంటే చంద్రబాబునాయుడు రాక్షసానందం పొందుతున్నారన్నారు. రానున్న ఎన్నికలలో అవ్వతాతలే ఓటుతో చంద్రబాబుకి తగిన గుణపాఠం
చెప్పాలని బూచేపల్లి పిలుపునిచ్చారు. మండల ఇన్ చార్జ్లు చిన్నపురెడ్డి మస్తాన్ రెడ్డి, నరసింహారెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు ఇడమకంటి వెంకటేశ్వరరెడ్డి, మంచాల ప్రియాంకనాగార్జునరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్ యాడిక శ్రీని వాసరెడ్డి, సర్పంచ్ ల సంఘ మండల అధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూదన్ రెడ్డి, కోటా రామిరెడ్డి, గోళ్లపాటి మోషే, మాజీ జెడ్పీటీసీ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, బెల్లం కొండవారిపాలెం, దోసకాయలపాడు సర్పంచ్ ల పోశం సుమలతాశ్రీకాంత్ రెడ్డి, కోట శివలక్ష్మీవెంకటరామిరెడ్డి, ఎంపీటీసీ గూడా సరస్వతీ ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *