సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ డాక్టర్ రమేశ్ సంపంగి కి అరుదైన గౌరవం లభించింది. ఘనా దేశానికి చెందిన ప్రతిష్టాత్మక మైల్స్ లీడర్ షిప్ యూనివర్సిటీ తనకు పర్యావరణం, ప్రజాసేవ రంగాల్లో గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది.ఆఫ్రికా దేశమైన ఘనా లోని యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన స్నాతకోత్సవంలో డాక్టర్ రమేశ్ డాక్టరేట్ ను అందుకున్నారు.ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ఇది తన జీవితంలోనే అత్యున్నత, అరుదైన పురస్కారంగా భావిస్తున్నానని ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఇప్పటికే ఎన్నో దేశాల నుంచి అనేక పురస్కారాలు అందుకున్నాను అని, ఈ డాక్టరేట్ మాత్రం తాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.మైల్స్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న వారిలో మన దేశం నుంచి డాక్టర్ సంపంగి రమేశ్ 26వ వ్యక్తి కావడం విశేషం..
హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్, ప్రకృతి వ్యవసాయం, నిర్మాణం, బయో ఫార్మింగ్ రంగాల్లో సంచలనాలు సృష్టిస్తున్న సంపంగి గ్రూప్ ఛైర్మన్ రమేష్ ప్రకృతిని అమితంగా ప్రేమిస్తూ
రియల్ ఎస్టేట్ రంగాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు.. భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా ఖర్జూరా పంటను హైదరాబాద్ లో పండించి విజయం సాధించారు. హైదరాబాద్ శివారు నారాయణ ఖేడ్ లోని 300 ఎకరాల వెంచర్ లో ఆర్గానిక్ ఖర్జూరా పండించి వాటిని అమ్మడం ద్వారా వచ్చిన లాభాల్ని వెంచర్ లో కొనుగోలుచేసిన వారికి అందజేయడం ఆయన ప్రత్యేకతగా మార్చుకున్నారు.
1987లో వరంగల్ లో జన్మించిన డాక్టర్ రమేశ్ సంపంగి నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. చదువులో ఎప్పుడూ టాప్ లో ఉండేవాడు. అయితే తన 15 వ ఏట తండ్రి చనిపోవడంతో కుటుంబ భారాన్ని తానే మోయాల్సి వచ్చింది.. చేతిలో 150 రూపాయలతో వరంగల్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రమేశ్ ఈ రోజు ఈ స్థితికి చేరుకోవడానికి పడ్డ కష్టం అనితర సాధ్యం.నిర్మాణాల పర్యవేక్షణ మొదలు బ్యాంకింగ్.రియల్ ఎస్టేట్
ఇలా ఎన్నో రంగాల్లో పని చేశారు. రెండు దశాబ్దాల అపార అనుభవం గడించాక తమ్ముడు సురేష్ సంపంగితో కలిసి సంపంగి గ్రూపును ఏర్పాటు చేశారు.
అప్పటి నుంచి నాలుగేళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా సంపంగి గ్రూపు కార్యాలయాలు ఏర్పాటు చేయగలిగారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అద్భుతాలు చేస్తూనే తాను ఎదిగివచ్చిన తీరును మరిచిపోలేదు.చదువు కోసం నిరుపేద విద్యార్థులకు తన వంతు అండగా నిలిచారు. ఉద్యోగుల కష్ట సుఖాల్లో వారికి అండగా ఉంటూ వచ్చారు.చిన్నప్పటి నుంచి వ్యవసాయం పైన వున్న మక్కువ తో ఇలా రియల్ ఎస్టేట్ ను ఆర్గానిక్ వ్యవసాయాన్ని కలిపి కొత్త ఒరవడిని సృష్టించారు డాక్టర్ రమేశ్ సంపంగి.
ఖర్జూరా అంటేనే సౌదీ అరేబియా.ప్రపంచం మొత్తానికి సౌదీ నుంచే ఖర్జూరా ఎగుమతి చేస్తారు.కానీ మొదటి సారి ఆర్గానిక్ ఖర్జూరా హైదరాబాద్ లో పండించి దాన్ని సౌదీకి ఎగుమతి చేసిన ఘనత మాత్రం డాక్టర్ సంపంగి రమేశ్ దక్కించుకున్నారు.
అందుకే ఆయనకు ఎన్నో పురస్కారాలు వరించాయి. గోవా ప్రభుత్వం మహాత్మాగాంధీ సేవా పురస్కారాన్ని అందించింది. ఇంటర్నేషనల్ బిజినెస్ ఐకాన్ అవార్డు. కాన్ స్టిట్యూషన్ క్లబ్ నేషనల్ అచీవర్స్ అవార్డు, శ్రీలంక ప్రభుత్వం నుంచి ఇండో శ్రీలంకన్ ఫ్రెండ్షిప్ అవార్డులు ఆయనకు దక్కాయి.

