జగనన్న బస్సు యాత్రను జయప్రదం చేయాలి –వైఎస్సార్ సీపీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి -ముండ్లమూరు ,తాళ్లూరు మండల నాయకులతో సమావేశం నిర్వహణ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మేము సిద్ధం బస్సు యాత్రలో వైఎ స్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్ర సాదరెడ్డి అన్నారు. ముండ్లమూరు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం మండల స్థాయి కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన పొదిలి మండలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర జరగనుందన్నారు. బస్ యాత్రను విజయవంతం చేసేందుకు నాయకులు, మహిళలు సిద్ధంగా ఉండాల న్నారు. సమావేశంలో మండల ఇన్చార్జ్లు వెంకటరత్నం, కాపా నరసింహారెడ్డి, ఎంపీపీ సుంకర సునీతా బ్రహ్మారెడ్డి, జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు, జేసీఎస్ మండల కన్వీనర్ మేడికొండ జయంతి, వైస్ ఎంపీపీలు బంకా రమణమ్మ నాగిరెడ్డి, వేముల పద్మావ తిజానకిరామయ్య, మండల మాజీ కన్వీనర్ సూదిదేవర అంజయ్య, సర్పంచ్ ల సంఘ మండల మాజీ అధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి, రెడ్డి సంఘ జిల్లా అధ్యక్షుడు మేకల వెంకటేశ్వరరెడ్డి, నాయకులు పాలడుగు చిరంజీవి, పేరయ్య చౌదరి, కొండారెడ్డి, అంజి రెడ్డి, మేడగం వెంకటరమణారెడ్డి, భిక్షాలురెడ్డి, భద్రి సుబ్బారెడ్డి, గుణపాటి వెంకటేశ్వరరెడ్డి, వెంకటప్పా రెడ్డి, బిజ్జం కృష్ణారెడ్డి, యరబ్రోలు శ్రీనివాసరెడ్డి, వేముల శ్రీను, ముతికేపల్లి కృష్ణారెడ్డి, వెంగళరెడ్డి, కోటిరెడ్డి, తాతపూడి శాంతకుమార్, కోటి, దుగ్గినేని వెంకట్, మధుబాబు, వాతల రామిరెడ్డి, మొదుళ్ల సుబ్బారెడ్డి, జిల్లెలమూడి శివయ్య, పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తాళ్లూరు మండలం లో…
రానున్న ఎన్నికల్లో విజ యమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేయాలని వైఎస్సార్ సీపీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలోని
తూర్పుగంగవరం పార్టీ కార్యాలయంలో గురువారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామాల్లో నాయకులు ప్రతి కార్యకర్తను కలిసి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జగనన్న ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. పింఛన్ల అందే వరకు వృ ద్ధులు, మహిళలకు మన పార్టీ నాయకులు అండగా నిలవాలన్నారు. ఈ నెల 7వ తేదీన పొదిలి మండలం లో జరిగే జగనన్న బస్ యాత్రను జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జులు చిన్నపు రెడ్డి మస్తాన్ రెడ్డి, నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి, జేసీఎస్ మం డల కన్వీనర్ యాడిక శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ ల సంఘ మండల అధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూదనరెడ్డి, కోట రామిరెడ్డి, గోళ్లపాటి మోషే, మాజీ జెడ్పీటీసీ లోకిరెడ్డి వెంకటేశ్వ రరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు యాడిక యలమందా రెడ్డి, కుమ్మిత జయరామిరెడ్డి, సర్పంచ్ లు కోట శివల క్ష్మీవెంకటరామిరెడ్డి, పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి చిమట సుబ్బారావు, ఎస్కే వలి, చార్లెససర్జన్, మందా శ్యాంసన్, ఎంపీటీసీ సభ్యుడు చినపుల్లమ్మ యోహాన్, ప్రభుదాస్, బాలకోటయ్య, మండల నాయకులు పులి ప్రసాద్ రెడ్డి, గుజ్జుల యోగిరెడ్డి, భీమి రెడ్డి నాగమల్లేశ్వరరెడ్డి, జక్కుల రామకృష్ణ, పూనూరి దేవదానం, గువ్వల వెంకటశ్రీనివాసరెడ్డి, కటకంశెట్టి శ్రీనివాసరావు, పుట్టా హరిబాబు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *