వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. దర్శి మండలంలోని బొట్ల పాలెంలో మన ఊరు మన శివన్న కార్యక్రమం గురువారం జరిగింది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజ లందరూ సంతోషంగా ఉన్నారన్నారు. జగనన్న ప్రవేశ పెట్టిన సంక్షేమం అభివృద్ధి, పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయన్నారు. మాట తప్పని మడమ తిప్పని నేత ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ..పేదరికంతో విద్య దూరం కాకూడాదని, పేద విద్యా ర్థులందరూ ఉన్న చదువులు చదువుకోవాలని అమ్మఒడి పథకం ప్రవేశ పెట్టారన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కుమారుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీపీ సుధా అచ్చయ్య, మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, ఎంపీటీసీ ఆలూరి నరేష్, సర్పంచ్ గంథం ఎలమంద, గ్రామ నాయకులు సాగం వెంకట రెడ్డి, గంగిరెడ్డి బాలకోటిరెడ్డి, గంగిరెడ్డిపాలెం శ్రీనివా సరెడ్డి, భోగసముద్రం సుబ్బారెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, కొరివి ముసలయ్య, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ కేవీ రెడ్డి, మాజీ సాగర్ ప్రాజెక్టు వైస్ చైర్మన్ సద్ది పుల్లారెడ్డి, సోషల్ మీడియా కో కన్వీనర్ ఎర్రమల మధుసూదన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకనాటి మహనం దరెడ్డి, శీలం శ్రీనివాసరెడ్డి, గోపాల్ రెడ్డి , బండారు అప్పన్న, బండారు సుబ్బారావు, ముత్తుకూరు శ్రీను, కొత్తపల్లి శ్రీను, మిట్ట వెంకట్రావు, దేవరకొండ వెంకటస్వామి పాల్గొన్నారు.



