ఎటువంటి కమిషన్లకు కక్కుర్తి పడని మంచివ్యక్తి బూచేపల్లి శివప్రసాదరెడ్డిని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. అందుకే తామంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరామని నీలిశెట్టి మురళి, ఆరేటి నాగరాజు తదితర నాయకులు స్పష్టం చేశారు. దర్శి లోని బూచేపల్లి నివాసంలో మురళి, నాగరాజుల ఆధ్వర్యంలో 40 కుటుంబాలకు చెందిన 150 టీడీపీ నాయకులు గురువారం వైఎస్సార్ సీపీలో చేశారు. వారందరికీ దర్శి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 ఏళ్లుగా బూచేపల్లి కుటుంబాన్ని చూస్తున్నామని, నీతి నిజాయతీకి మారుపేరన్నారు. మచ్చలేని కుటుంబం వారిదని చెప్పారు. కమిషన్లకు పాల్పడే వ్యక్తులు కాదని, అందరికీ సాయం చేసే మంచి గుణం కల వారని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చాలా బాగుందని, పేదలందరికీ ఇంటింటికీ పథకాలు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అత్య ధిక మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. డాక్టర్ బూచే పల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. జగనన్న పాలనను మెచ్చి తమపై నమ్మకంతో పార్టీలో చేరిన వారికి సము చిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా పని చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవి రెడ్డి భాస్కర్‌రెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలో చేరిన వారిలో నీలిశెట్టి మురళి, పసుపులేటి సురేష్, ఆరేటి నాగరాజు, పాశం నారాయణ, రాగిశెట్టి ఆంజనేయులు, మల్లికార్జున, నీలిశెట్టి శ్రీను (ఏసన్న), నీలిశెట్టి వెంకటేశ్వర్లు, నీలిశెట్టి పెద్ద కొండయ్య, పసు పులేటి ఆశోక్, తమ్మిశెట్టి లక్ష్మయ్య, నీలిశెట్టి రమేష్, తమ్మిశెట్టి ఏడుకొండలు, నీడిగంటి ప్రసాద్, పసుపు లేటి వెంకటస్వామి, నాయుడు సాయి, పుసులేటి కార్తీక్, నీలిశెట్టి మణికంఠ, నీలిశెట్టి ప్రసన్న, ఆరేటి నాయుడు, నీలిశెట్టి ఏసన్న, పసుపులేటి అంజయ్య, కమ్మిశెట్టి ఆంజనేయులు, కమ్మిశెట్టి పాపయ్య, నీలిశెట్టి కిరణ్, పసుపులేటి నారాయణ, నీలిశెట్టి రవి, నీలిశెట్టి మహేష్, నాయుడు మీరయ్య, పాశం బాలాజీ, నీలి శెట్టి ఏడుకొండలు, నీలిశెట్టి సిహాచలం, పసుపులేటి ఆదినారాయణ, పసుపులేటి సతీష్‌లు ఉన్నారు. గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
కురిచేడు మండలం లో…
కురిచేడు లోని తూర్పు హరిజనవాడకు చెందిన 20 కుటుంబాల వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి , జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ సమ క్షంలో ఆ పార్టీలో చేరారు. వారిని శివప్రసాదరెడ్డి, వెంకాయమ్మలు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో ఎంతకాలం పనిచేసినా తమకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని, వైఎస్ జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి, సం క్షేమ పథకాలతో అభివృద్ధి చెందుతున్నామని, అం దుకోసమే పార్టీలోకి స్వయంగా వచ్చినట్లు పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో అల్లూరి కోటే శ్వరరావు, ఎం.నారాయణ, బొమ్మతోటి పెద్ద చెన్నకే శవులు, యూ.ఓబులేసు సమక్షంలో మరో 16 కుటుంబాల వారు చేరారు. మండల జేసీఎస్ కన్వీనర్ మేరువ సుబ్బారెడ్డి, జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్ సైదా, మేరువ పిచ్చిరెడ్డి, బీసీ కార్పొరే షన్ డైరెక్టర్ నిమ్మకాయల రాజయ్య పాల్గొన్నారు.






