సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు3 పరిధిలోని బాలంరాయి చౌరస్తాలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్ తో కలిసి బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదిత ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దళిత కుటుంబంలో పుట్టి ఉన్నతస్థాయికి చేరిన జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. బాబుజీగా ప్రఖ్యాతిగాంచిన జగ్జీవన్ రామ్ అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. దేశం గర్వించదగ్గ దళిత మేధావి జగ్జీవన్ రామ్ అని నివేదిత కీర్తించారు.
ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు టీఎన్ శ్రీనివాస్, శత్రుఘ్న మధు, శేఖర్, భాస్కర్ ముదిరాజ్, మురళి యాదవ్, వంగల మల్లేశ్, గజ్జెల గోపాల్, త్యాగరాజు, దర్శన్ తదితరులు పాల్గొన్నారు.

