బాబూ జగజ్జీవన్ రామ్ బడుగు.బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని వక్తలు కొనియాడారు.
ఓల్డ్ బోయిన్ పల్లి బాబు జగ్జీవన్ రామ్ అసోసియేషన్ అధ్వర్యంలో
ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు,మల్కాజ్గిరి పార్లమెంటరీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు . అనంతరం ఓల్డ్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, కర్రె జంగయ్య ,దండుగుల యాదగిరి, మక్కల నర్సింగ్ రావు ,సయ్యద్ ఇజాజ్ మన్నె ఉదయ యాదవ్ ,హరినాథ్ బీజేపీ రవి బాబు లతో పాల్గొని జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు గడ్డం నర్సింగ్ రావు, బుర్రి యాదగిరి ,నల్లోల్ల రాజేందర్ , గుండెల జగదీష్ బాబు, శశికళ రోజా కమిటీ సభ్యులు నివాళులు అర్పించారు.07:30 PM



