మల్కాజ్ గిరి పార్లమెంట్ లో బీ ఆర్ ఎస్ అభ్యర్థి రాగిడికి భారీ మెజార్టీ అందించాలి……కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం – ఈటెల రాజేందర్ చెల్లని రూపాయి.ఆయన ఎక్కువ గాఉహించుకుంటున్నరు – కే సి ఆర్ అభివృద్ధి ప్రదాత – మల్కాజ్ గిరి లో బీ ఆర్ ఎస్ విజయం తథ్యం .. రాగిడి.

మల్కాజ్ గిరీ పార్లమెంట్ బీ ఆర్ ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నీ భారీ మెజార్టీ తో గెలిపించాలని,కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు నిచ్చారు శుక్రవారం బేగంపేట డివిజన్ మయూరి మార్గ్ వాత్సల్య గెస్ట్ హౌస్ లో బీ ఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్ పీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నీ ఎమ్మెల్యే మాధవరం కార్యకర్తలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా మాధవరం మాట్లాడుతూ బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కే సి ఆర్ తెలంగాణా రాష్ట్ర అభవృద్ది తో పాటు కూకట్ పల్లీ నియోజకవర్గాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు.బేగంపేట డివిజన్ లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని స్మశాన వాటిక ను అత్యాధునిక వసతులతో నిర్మింప చేశారని.రోడ్లు.డ్రైనేజ్ సమస్యలతో పాటు ఎన్నో అభి వృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలియ జేశారు.మల్కాజ్ గిరి పార్లమెంట్ బీ ఆర్ ఎస్ అభ్యర్థి రాగీది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అభివృద్ధి ప్రదాత అని అన్నారు.తెలంగాణా రాష్ట్రం తో పాటు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిలో ముందంజలో నిల్పారని అన్నారు.బీ జె పీ అభ్యర్థి
ఈటేల చెల్లని రూపాయి అని.తనను తాను ఆయన ఎక్కువగా వూహించుకుంటున్నరని రాగీడి ఆరోపించారు .తమ పార్టీకి డిపాజిట్ సంగతి ఆయనకు ఎందుకు మల్కాజ్ గిరీ లో ఆయన ఎవరో ప్రజలు తెలుస్తారని అన్నారు.ఆయన సొంత నియోజక వర్గం లోనే ప్రజలు ఈటెల ను తిరస్కరించారని రాగిది అన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న బేగంపేట కార్పొరేటర్ టి.మహేశ్వరి మాట్లాడుతూ కూకట్ పల్లీ నియోజక వర్గం లో ఒక డివిజన్ గా వున్న బేగంపేట ను గతం లో ఎమ్మేల్యేలు ఎవరూ పట్టించుకోలేదని,మాధవరం ఎమ్మెల్యేగా అయ్యాక బేగంపేట డివిజన్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని.బేగంపేట డివిజన్ ప్రజలు మాధవరం కృష్ణారావు నీ ఎప్పటికీ గుర్తుంచు కుంటారు అని అన్నారు.రాగిదీ నీ కూడా భారీ మెజార్టీ తో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మహేశ్వరి కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు టి. శ్రీ హరి.నాగూ రఘునాథ్.నరేష్,.పేపర్ శ్రీను.,మాణిక్,సి.సత్యనారాయణ.యాదగిరి గౌడ్.సామల పాండు.బంగారు శ్రీను.టి.శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *