దర్శి పట్టణంలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన ముఖ్యనాయకులైన కో అప్షన్ మెంబర్ షేక్ చిన్న మస్తాన్ వలి, జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ ఫరీద్, వార్డు మాజీ మెంబర్ శైలజ, మండల మాజీ కన్వీనర్ బల్లగిరి శీనయ్యతో పాటు 40 కుటుంబాలకు చెందిన 150 మంది కార్య కర్తలు, మహిళలు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారందరికీ వైఎస్సార్ సీపీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్సార్ సీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బల్లగిరి శీనయ్య మాట్లాడుతూ …బీసీలకు పెద్ద పీట వేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. బీసీలంటే బ్యాక్ బోన్ గా చెప్పుకునే
వైఎస్సార్ సీపీలో చేరే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిజగనన్నకి బీసీలను వాడుకుని వదిలేసే చంద్ర బాబుకు చాలా తేడా ఉందన్నారు. రానున్న ఎన్ని కల్లో బీసీలందరూ ఏకమై వైఎస్సార్ సీపీ విజయా నికి కృషి చేయాలని కోరారు. చిన్న మస్తాన్ వలి మాట్లాడుతూ… బూచేపల్లి శివన్నను 20 ఏళ్లుగా చూస్తున్నానని, వారి కుటుంబంలోని వారందరికీ పదిమందికి సాయం చేయడం తప్ప ఆశించే గుణం లేదని అన్నారు. అటువంటి మంచి వ్యక్తులతో కలిసి పార్టీలో కొనసాగాలని టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరామన్నారు. షేక్ ఫరీద్ మాట్లా డుతూ ఈ ఎన్నికల్లో నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని భారీ మెజార్టీతో గెలింపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. బూచేపల్లి కుటుంబంతోనే తమ పయనం ఎప్పటికీ ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలంతా వైఎస్సార్ సీపీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సిపి దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ ఏ అవసరం వచ్చినా బూచేపల్లి ఇంటి తలుపులు ఎల్ల వేళలా తెరిచే ఉంటాయన్నారు. నేరుగా తననను కలిసి అవసరాలు తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ తగిన గుర్తింపు ఇచ్చి అన్నివేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మీ అందరి సహకా రాన్ని, ప్రేమానురాగాలను ఎప్పటికీ మర్చిపోనుగా స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో షేక్ ఇమాబి. ఫరీదా, సల్మా, ఇతర నాయకులు ఉన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా, వైఎస్సార్ సీపీ వ్యవసాయ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, వాడా ఇన్చార్జ్ మజ్ఞువలి, మండల కన్వీనర్ వెన్నపూ వెంకటరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్ట కుమ్మిత అంజిరెడ్డి, నెట్క్యాప్ డైరెక్టర్ సానికొము తిరుపతిరెడ్డి, శీలంశ్రీనివాసరెడ్డి, దారం వాసుదేవా రెడ్డి, కర్ణా భాస్కర్ రెడ్డి, నరసింహారెడ్డి, నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



